Gandhi Jayanthi 2021: ఏడుపుల డ్రామా..ట్విట్టర్‌లో హంగామా.. ప్రచారం కోసం బాపూజీనీ వదలలేదు!

మన రాజకీయనాయకులు ప్రచారం దొరుకుతుంది అంటే.. ఏ ఒక్క విషయాన్నీ వదిలిపెట్టరు. ఆఖరికి గాంధీజీని కూడా. ఈ సంవత్సరం బాపూ 152వ జయంతి జరుపుకున్నాం.

Gandhi Jayanthi 2021: ఏడుపుల డ్రామా..ట్విట్టర్‌లో హంగామా.. ప్రచారం కోసం బాపూజీనీ వదలలేదు!
Gandhi Jayanthi 2021
KVD Varma

|

Oct 03, 2021 | 5:02 PM

Gandhi Jayanthi 2021: మన రాజకీయనాయకులు ప్రచారం దొరుకుతుంది అంటే.. ఏ ఒక్క విషయాన్నీ వదిలిపెట్టరు. ఆఖరికి గాంధీజీని కూడా. ఈ సంవత్సరం బాపూ 152వ జయంతి జరుపుకున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మూలనపడిన గాంధీ విగ్రహాలను.. ప్రతి ఏటా చేసే విధంగానే దుమ్ము దులిపి.. అలంకరణలు చేసి.. విగ్రహానికి దండలేసేశారు. ఇక అక్కడకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి గాంధీ గొప్పతనాన్ని మైకులు పగిలిపోయేలా చెప్పేశారు. తరువాత యధావిధిగా ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. ఈ గాంధీ జయంతి వేడుకల్లో కొందరు నాయకులు చేసిన పని చూసి నెటిజన్లు హా..శ్చర్యపోయారు. ఎందుకంటే, గాంధీగారి విగ్రహం దగ్గర సదరు నాయకులు గుక్క తిప్పుకోకుండా ఏడ్చేశారు. మామూలుగా కాదు.. బాపూ విగ్రహాన్ని పట్టుకుని వలవలా వారు ఏడుస్తుంటే.. అక్కడ ప్రజలకు మాత్రం నవ్వాలో ఏడవాలో అర్ధం కాక నిశ్చేష్టులైపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లో ఒకచోట సమాజ్ వాది పార్టీ నాయకుడు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. విగ్రహాన్ని పట్టుకుని ఏడుపు మొదలెట్టారు. తరువాత మధ్యలో కాస్త ఏడుపు నుండి విరామం తీసుకొని, అతను విగ్రహం వైపు చూసి బాపుతో ‘మాట్లాడాడు’. “దేశ్ కో అనాత్ కారకే, హుమెయిన్ చోడ్ గయే. అనాత్ బనకే చలే గయే ఆప్. ఇట్నా బడా దేశ్ హుమెయిన్ ఆజాద్ కర దియా. లేకిన్ హుమారి తమన్నా జో థీ సబ్ ఖతం హోతి జా రహీ హై, సబ్ బెకర్ హోతే జా రహా హై. బాపు ఆప్ కహాన్ చలే గయే? ఇట్నీ బడి అప్లాబ్ధి డి కే కహాన్ చలే గయే? ఇట్నా బడా దేశ్ హుమెయిన్ ఆజాద్ కర్ కే, హుమారే బచో కే లియే … ఆప్ కహాన్ చలే గయే? (మీరు దేశాన్ని అనాధ చేశారు … మీరు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు? మీరు మాకు స్వాతంత్య్రం ఇచ్చారు..తరువాత మమ్మల్ని అనాధ చేశారు? మీరు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టారు?), ”అని ఆయన ఏడుస్తూనే గాంధీజీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా హసీబ్ అహ్మద్ వెనుక నిలబడి నవ్వుతూ తన అసిస్టెంట్ ఒకరు మొత్తం డ్రామాను పాడు చేసేశాడు.

ఈ వీడియోను కింద ట్విట్టర్ లో మీరు చూడొచ్చు..

ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇక దీనిని చూసిన వారు వదలకుండా కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు.. గతంలో ఇలానే చేసిన ఒక నేత వీడియోను మళ్ళీ బయటకు తీసి వదిలారు. ఆ పాత వీడియో 2019 నాటిది. అందులో.. నిరాశకు గురైన కాంగ్రెస్ నాయకుడు బాపు చిత్రపటాన్ని తన ‘భావోద్వేగ రహిత’ సహాయకుడు పట్టుకున్నప్పుడు అతను భావోద్వేగ ఏకపాత్రాభినయం చేస్తూ ఏడుస్తూ కనిపిస్తాడు. మరో ముగ్గురు మద్దతుదారులు భావోద్వేగ కాంగ్రెస్ నాయకుడి వెనుక నిలబడ్డారు. వాస్తవానికి, వారిలో ఒకరు కెమెరా కోసం నవ్వుతూ కూడా కనిపిస్తారు. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ”గాంధీజీ ఒక్కసారి మాత్రమే కాకుండా అనేకసార్లు హత్యకు గురయ్యారు” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

సాధారణ సందర్భాలలో అయితే ఇలా ఇంత రియాక్షన్ ఉండకపోవచ్చు. త్వరలో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే, ఈ నాయకుల ఓవరాక్షన్ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొత్తమ్మీద గాంధీజీ పుట్టినరోజును కూడా వదలకుండా ప్రచారం కోసం పాట్లు పడుతున్న నాయకులను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Also Read: Hyderabad Traffic: అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు ట్రాఫిక్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ఈ వార్తపై పోలీసులు ఏమని స్పందించారంటే.

PM Narendra Modi: విమర్శలు వేరు.. ఆరోపణలు వేరు.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu