Inspiring Person: నైట్ వాచ్‌మన్.. సీన్ కట్ చేస్తే ఐఐఎంలో ప్రొఫెసర్.. ప్రొ. రంజిత్ సక్సెస్ స్టోరీ..

Inspiring Person: కృషి పట్టుదల ఉంటే.. మనుషులు ఋషువులవుతారు అన్న మాటని గుర్తు చేస్తూ.. కొందరు.. తమ జీవితంలో అనుకోని పరిస్థితిలు ఎన్ని ఎదురైనా అనుకున్నది..

Inspiring Person: నైట్ వాచ్‌మన్.. సీన్ కట్ చేస్తే ఐఐఎంలో ప్రొఫెసర్.. ప్రొ. రంజిత్ సక్సెస్ స్టోరీ..
Ranjith Ramachandran
Follow us

|

Updated on: Nov 17, 2021 | 1:38 PM

Inspiring Person: కృషి పట్టుదల ఉంటే.. మనుషులు ఋషువులవుతారు అన్న మాటని గుర్తు చేస్తూ.. కొందరు.. తమ జీవితంలో అనుకోని పరిస్థితిలు ఎన్ని ఎదురైనా అనుకున్నది సాధిస్తారు.  పేదరికం తమ లక్ష్యానికి ఎటువంటి అడ్డంకులు కావని నిరూపించి.. చరిత్రలో తమకంటూ ఓ పీజీ లిఖించుకుంటారు. అంటూ వ్యక్తి ఒకరు ప్రొఫెసర్ రంజిత్. పేదరికంలో పుట్టి.. చదువుకోసం.. బతకడం కోసం వాచ్ మెన్ గా పనిచేస్తూ.. చదువుకున్నారు.. నేడు ఐఐఎంలో ప్రొఫెసర్‌ గా విధులను నిర్వహిస్తున్నారు. వాచ్ మెన్ నుంచి ఈ రోజు ఈ స్టేజ్ కు చేరుకోవడం రంజిత్ శ్రమ పట్టుదల గురించి తెలుసుకుందాం..

రంజిత్‌ రామచంద్రన్‌ కేరళలోని కసర్‌గడ్‌ జిల్లా పనాథూర్‌ స్వగ్రామం. రంజిత్ సహా ఐదుగురు కుటుంబ సభ్యలు చిన్న పూరిగుడెసెలో నివాసం. రంజిత్‌ పేదరికంలో పుట్టాడు. తండ్రి బట్టలు కుట్టేవాడు. తల్లి కూలీ పనికి వెళ్తుండేది. తినడానికి తిండికి సరిపడే సంపాదన లేకపోవడంతో.. ఒక పూట తిని.. మరొక పూట పస్తులతో ఉండేవారు.

చదువుకోసం వాచ్‌మన్‌గా..

అయితే రంజిత్‌ రామచంద్రన్‌ కు చదువంటే ఆసక్తి.. ఎన్ని కష్టాలు వచ్చినా చదువుని ఎప్పుడూ నెగ్లెట్ చేయలేదు.. అయితే తలిదండ్రులు తాము చదివించలేమని.. ఏదైనా పనిచేసుకోమని చెప్పారు. దీంతో ఏదైనా పని చేస్తూ చదువుకోవాలని అనుకున్నాడు. ఎంత వెతికినా పని దొరకలేదు. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఆఫీసులో నైట్‌ వాచ్‌మన్‌ ఉద్యోగం దొరికింది. రంజిత్ కు నెలకు నాలుగు వేలు ఇచ్చేవారు.

పీహెచ్‌డీ వరకూ చదువు:

ఓవైపు నైట్ వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే రాజాపురంలో ఎకనామిక్స్‌తో బీఏ పూర్తి చేశాడు. కాసర్‌గోడ్‌లోని కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ చదివాడు. అనంతరం ఐఐటీ మద్రాస్‌నుంచి పీహెచ్‌డీ పట్టా తీసుకున్నాడు. అయితే ఇంగ్లీషు పై పట్టులేని రంజిత్ కు పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో మధ్యలోనే గుడ్ బై చెప్పేద్దామని కూడా అనుకున్నాడు. అయితే చదువు కోవడం కోసం తాను పత్తివరకూ పడిన కష్టాన్ని గుర్తు చేసుకుని.. గైడ్‌, ప్రొఫెసర్‌ సుభాష్‌ సాయంతో ఇంగ్లీషు మీద పట్టుసంపాదించాడు. పరిశోధన కంప్లీట్ చేశారు.

పీహెచ్‌డీ పూర్తి చేసిన రంజిత్ బెంగళూరు క్రైస్ట్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశాడు. అప్పుడే ఐఐఎంలో ప్రొఫెసర్‌ కావాలని కల గన్నాడు. మళ్ళీ కష్టపడడం మొదలు పెట్టాడు. చివరికి రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో వైరల్‌: 

తన గురించి తాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసుకుంటూ రంజిత్ తన ఇంటి ఫొటోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ ఫోటోకి ప్రతి ఒక్కరూ కలలు కనండి. వాటిని సాకారం చేసుకునేందుకు పోరాడండి!’ అనే క్యాప్షన్‌ జోడించాడు. ‘ఒక ఐఐఎం ప్రొఫెసర్‌ ఇక్కడ జన్మించాడు’.. తనపేరు ట్యాగ్‌ చేశాడు.  పేదరిక నుంచి ప్రొఫెసర్ గా రంజిత్ జర్నీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. రంజిత్‌ నేటి యువతకు ఆదర్శప్రాయుడు. కష్టాలకు ఎదురీది విజయం సాధించిన రంజిత్‌ వంటి విజేతలను నేటి యువత  ఆదర్శంగా తీసుకోవాలి.

Also Read:   మనదేశంలో అంటువ్యాధి దశ నుంచి సాధారణ వ్యాధిగా మారిన కరోనా.. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా…

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!