Karnataka ఏ శక్తులూ కర్ణాటక అభివృద్ధిని ఆపలేవు.. గ్లోబల్ సమ్మిట్ లో బసవరాజ్ బొమ్మై కామెంట్

కర్నాటకలో(Karnataka) త్వరలో ఎన్నికలు జరగనుండగా.. బొమ్మై నేతృత్వంలో కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం(BJP) వెల్లడించింది. రానున్న ఎన్నికలకు సన్నాహాలు ఎలా జరుగుతున్నాయన్న అంశంపై...

Karnataka ఏ శక్తులూ కర్ణాటక అభివృద్ధిని ఆపలేవు.. గ్లోబల్ సమ్మిట్ లో బసవరాజ్ బొమ్మై కామెంట్
Basavaraj Bommai
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Jun 19, 2022 | 9:33 PM

కర్నాటకలో(Karnataka) త్వరలో ఎన్నికలు జరగనుండగా.. బొమ్మై నేతృత్వంలో కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం(BJP) వెల్లడించింది. రానున్న ఎన్నికలకు సన్నాహాలు ఎలా జరుగుతున్నాయన్న అంశంపై బొమ్మై(Basavaraj Bommai) మాట్లాడారు. తమ లక్ష్యం స్పష్టంగా ఉందన్న ఆయన.. మిషన్-150 చేరుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా తమకు టార్గెట్ ఇచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను రానున్న కాలంలో నెరవేరుస్తామని వెల్లడించారు. న్యూ ఇండియా కోసం “న్యూ కర్నాటక ఫర్ న్యూ ఇండియా” అనే నినాదాన్ని తెచ్చామని చెప్పారు. న్యూఢిల్లీలో TV9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమావేశానికి బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కర్ణాటక ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 400 తమ రాష్ట్రంలోనే ఉన్నాయని వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్సింగ్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కర్నాటకలో అత్యధిక సంఖ్యలో రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. 400 రీసెర్చ్ కేంద్రాలను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక నగరం బెంగళూరు అని స్పష్టం చేశారు.

500 ఫార్చ్యూన్ కంపెనీల్లో 400 కర్ణాటకలోనే ఉన్నాయి. అదే దేశ ఆర్థిక వ్యవస్థలో కర్నాటక ప్రాధాన్యత గురించి చెబుతుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న మార్పునకు మేము మార్గదర్శకులం. ఇది సాంకేతికతతో నడిచే అభివృద్ధి. ఇది స్థిరమైనది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, భారతదేశ వృద్ధికి కర్నాటక అందించే అతి పెద్ద సహకారం. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం కచ్చితంగా సహాయం చేస్తుంది. ప్రధాని మోడీ ఒక దార్శనికుడు. జనాభా విస్ఫోటనం, జనాభా పెరుగుదల గురించి గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ITIల నుంచి IITల వరకు నైపుణ్యం కలిగిన సాంకేతిక కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు.

       బసవరాజ్ బొమ్మై, కర్నాటక ముఖ్యమంత్రి

ప్రతి మనిషిలో ఎదగాలన్నదే ప్రాథమిక ఆకాంక్షగా ఉంటుందని బసవరాజ్ బొమ్మై చెప్పారు. అది మాత్రమే మన వృద్ధికి సహాయపడుతుందన్నారు. త్వరలో జరగనున్న బీబీఎంపీ ఎన్నికల్లో బెంగళూరును నిజమైన అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. తమ లక్ష్యం మిషన్ 150 అన్న బొమ్మై.. దానిని సాధించడానికి ఆరు నెలల క్రితమే చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. కర్ణాటకలో ఎలాంటి సమస్యలు ఉన్నా చట్టబద్ధంగానే పరిష్కరించుకున్నామని బొమ్మై చెప్పారు. తాము కచ్చితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కర్ణాటక సిలబస్ లో మార్పులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అందులో ఎలాంటి మార్పు కావాలన్నా.. ఆ నిరసన సబబుగా ఉంటే అప్పుడు ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు.. ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు కర్ణాటకలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని బెంగళూరుకు రానున్నారు. సాయంత్రం దాకా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాక మైసూరుకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం పరిశీలించారు. కొమ్మఘట్టలో ప్రధాని కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు. బెంగళూరు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండేదని ఎట్టకేలకు పూర్తి అవుతోందన్నారు. తాజాగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున సభాప్రాంగణంలో పాల్గొనేవారు కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని, సభకు హాజరయ్యేవారు అవసరం లేదన్నారు. తనతో సహా మంత్రులు, అధికారులందరికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20(రేపు) నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను బొమ్మై పర్యవేక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu