B S Yediyurappa: భూముల డీనోటిఫికేషన్‌ కేసులో ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకు చుక్కెదురు..!

B S Yediyurappa: భూముల డీనోటిఫికేషన్‌ కేసులో ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకు చుక్కెదురు..!
B S Yediyurappa

B S Yediyurappa: భూముల డీనోటిఫికేషన్‌ కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకు న్యాయస్థానంలో చుక్కెదురైంది.15 సంవత్సరాల నాటి భూకేటాయింపులకు..

Subhash Goud

|

Jul 04, 2021 | 6:03 AM

B S Yediyurappa: భూముల డీనోటిఫికేషన్‌ కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకు న్యాయస్థానంలో చుక్కెదురైంది.15 సంవత్సరాల నాటి భూకేటాయింపులకు సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ‘బి-రిపోర్ట్’ను శనివారం బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసు వ్యవహారంలో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారితో దర్యాప్తును కొనసాగించడం సహా తుది నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తులో జాప్యంపై కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించింది.

వర్తూర్-వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్‌ పరిధిలోని బెల్లాండూర్, దేవర బీసనహళ్లిలోని విలువైన భూమి డీనోటిఫికేషన్‌కు సంబంధించి యడ్యూరప్ప అవకతవకలకు పాల్పడ్డారంటూ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అప్పటి జేడీయస్‌-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో యడ్యూరప్ప ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి 2015 ఫిబ్రవరి 21న అవినీతి నిరోధక చట్టం కింద లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తును ముగించాలని కోరుతూ 2020 డిసెంబరులో యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ కోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో పాటు దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టులో యడ్యూరప్పకు చుక్కెదురైంది.

ఇవీ కూడా చదవండి

UP Local Body Polls: ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకెళ్లిన బీజేపీ.. అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ

‘నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు కోరుతున్నారు’.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu