Free Vaccine Policy: 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీ.. సోమవారం నుంచి కొత్త క‌రోనా వ్యాక్సిన్ పాల‌సీ అమలు..

Covid Vaccine:

Free Vaccine Policy: 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీ.. సోమవారం నుంచి కొత్త క‌రోనా వ్యాక్సిన్ పాల‌సీ అమలు..
Covid19 Vaccine
Sanjay Kasula

|

Jun 20, 2021 | 3:53 PM

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త క‌రోనా వ్యాక్సిన్ పాల‌సీ సోమ‌వారం సోమవారం నుంచి అమ‌ల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు వేయ‌నుంది. ఈ నెల 8న ప్ర‌ధాని మోడీ దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. 75 శాతం వ్యాక్సిన్ల‌ను త‌యారీదారుల నుంచి కొని అంద‌రికీ ఫ్రీగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వ‌మూ వ్యాక్సిన్ల కోసం ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌సంర లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 45 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తోంది.

ఇంతకాలం వ్యాక్సిన్ విధానం ప్ర‌కారం 75 శాతం వ్యాక్సిన్ల‌ను కేంద్ర‌మే కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌నుండ‌గా.. మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లు మాత్రం ప్రైవేటు వారికి అమ్ముకునే అవ‌కాశం త‌యారీదారుల‌కు క‌ల్పించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వాక్సినెషన్ సండే పేరుతో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడుస్తోంది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి : AP POLICE: ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు

 Vaccination Sunday: ఏపీలో ఇవాళ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సిన్

CM KCR tour: ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు శ్రీకారం

Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి పెంపుడు కుక్క మృతి.. ట్వీట్ చేసిన బైడెన్‌ దంపతులు..

క్సిన్లు మాత్రం ప్రైవేటు వారికి అమ్ముకునే అవ‌కాశం త‌యారీదారుల‌కు క‌ల్పించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu