MIM-RJD: అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్..

AIMIM MLAs Joining in RJD: ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు బుధవారం ఆర్జేడీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలలో షానవాజ్, ఇజార్, అంజర్ నాయని, సయ్యద్ రుక్నుద్దీన్ ఉన్నారు. ఏఐఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ ఒక్కరు మాత్రం పార్టీని వీడలేదు.

MIM-RJD: అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్..
Aimim Mlas Joining In Rjd
Follow us

|

Updated on: Jun 29, 2022 | 6:02 PM

బీహార్‌లో ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఆర్జేడీ(RJD) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు బుధవారం ఆర్జేడీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలలో షానవాజ్, ఇజార్, అంజర్ నాయని, సయ్యద్ రుక్నుద్దీన్ ఉన్నారు. ఏఐఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ ఒక్కరు మాత్రం పార్టీని వీడలేదు. రాష్ట్రంలోని మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరు చేరిన నేపథ్యంలో తేజస్వీ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలిచామని అన్నారు. మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు. బోచన్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరగా.. గతంలో 76 మంది ఉన్నారు. బీహార్ శాసనసభలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు గతంలో ఆర్జేడీలోని వారే అని అన్నారు. అయితే వీరు సొంతింటికి తిరిగి వచ్చారని అన్నారు. మహాకూటమి బలంగా ఉండాలన్నది ప్రజల డిమాండ్ కాబట్టి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి వచ్చారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కావాలి..

ఈ ఎమ్మెల్యేలంతా సీమాంచల్ నుంచి వచ్చారని తేజస్వీ యాదవ్ అన్నారు. సీమాంచల్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. సీమాంచల్‌లో పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు తేజస్వీ యాదవ్. ఈ ఎమ్మెల్యేల రాకతో మహాకూటమి మరింత బలపడనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది కావాలి. మహాకూటమిలో 116 మంది ఉన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు తక్కువ.. కానీ మాకు అధికార దాహం లేదంటూ అన్నారు తేజస్వీ యాదవ్.

బీజేపీ, జేడీయూపై దాడి

బీజేపీ, జేడీయూలకు సంబంధించి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం వణుకుతోంది. బీజేపీ, జేడీయూ మధ్య పోరు సాగుతోంది. బీహార్‌లో నంబర్ త్రీ పార్టీకి సీఎం ఉన్నారు. కాబట్టి బీజేపీ నితీష్ కుమార్‌పై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం సెక్యులర్ పార్టీలన్నీ ఏకం కావాలని కోరుకుంటున్నామని తేజస్వి అన్నారు.

జాతీయ వార్తల కోసం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?