నువ్వు ఎవరైతే నాకేంటి? ఎవరినీ విడిచిపెట్టని కరోనా…మరో మాజీ సీఎంకి కోవిడ్ పాజిటివ్

Covid-19 Positive: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నువ్వు ఎవరైతే నాకేంటి? అన్నట్లు కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడంలేదు.

  • Janardhan Veluru
  • Publish Date - 12:36 pm, Sat, 17 April 21
నువ్వు ఎవరైతే నాకేంటి? ఎవరినీ విడిచిపెట్టని కరోనా...మరో మాజీ సీఎంకి కోవిడ్ పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం

HD Kumaraswamy: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నువ్వు ఎవరైతే నాకేంటి? అన్నట్లు కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడంలేదు. తాజాగా కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కోవిడ్ బారినపడ్డారు. ఆయనకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తనకు కరోనా సోకినట్లు స్వయంగా వెల్లడించిన కుమారస్వామి…గత కొన్ని రోజులుగా భౌతికంగా తనకు దగ్గరగా వచ్చిన వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత కొన్ని రోజులుగా కుమారస్వామి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం విస్తృతంగా పర్యటించారు. కుమారస్వామి గత నెల 23న కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నారు. 61 ఏళ్ల కుమారస్వామి డయాబెటీస్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…తెలంగాణలో కరోనా విలయతాండవం.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారిన పడుతోన్న వారిలో వారే అధికులు..