AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టులో మాజీ సీజేఐ గవాయ్‌పై షూ విసిరిన న్యాయవాదిని చెప్పులతో కొట్టిన తోటి లాయర్లు..!

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై షూ విసిరిన న్యాయవాది రాకేష్ కిషోర్‌కు ఘోర పరాభవం జరిగింది. ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయవాదులు చెప్పులతో కొట్టారు. ఇటీవల మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై షూ విసిరి గొడవకు కారణమైన న్యాయవాది రాకేష్ కిషోర్ ను బి.ఆర్. గవాయ్ క్షమించారు. అయితే, కొంతమంది న్యాయవాదులు మాత్రం కోపంతో రగిలిపోయారు.

కోర్టులో మాజీ సీజేఐ గవాయ్‌పై షూ విసిరిన న్యాయవాదిని చెప్పులతో కొట్టిన తోటి లాయర్లు..!
Former Cji Br Gavai, Advocate Rakesh Kishore
Balaraju Goud
|

Updated on: Dec 09, 2025 | 3:24 PM

Share

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై షూ విసిరిన న్యాయవాది రాకేష్ కిషోర్‌కు ఘోర పరాభవం జరిగింది. ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయవాదులు చెప్పులతో కొట్టారు. ఇటీవల మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై షూ విసిరి గొడవకు కారణమైన న్యాయవాది రాకేష్ కిషోర్ ను బి.ఆర్. గవాయ్ క్షమించారు. అయితే, కొంతమంది న్యాయవాదులు మాత్రం కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే కోర్టు కాంప్లెక్స్ లో ఆయనను చెప్పులతో కొట్టారు. రాకేష్ కిషోర్ కోర్టులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కొంతమంది న్యాయవాదులు అతనిపై దాడి చేశారు. అతన్ని తోసి, చెప్పులతో కొట్టారు. కోర్టు భద్రతా సిబ్బంది అతికష్టం మీద జోక్యం చేసుకుని అతన్ని బయటకు తీసుకెళ్లారు.

బిఆర్ గవాయ్ పై షూ విసిరిన కారణంగా రాకేష్ కిషోర్ ను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, తన చర్యల పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని కిషోర్ పేర్కొన్నాడు. దేవుడు తనకు కలలో కనిపించి అలా చేయమని సూచించాడని ఆయన పేర్కొన్నారు. కిషోర్ 2009 నుండి ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన సీనియర్ న్యాయవాది. ఆయన వయస్సు దాదాపు 71-72 సంవత్సరాలు ఉంటుందని అంచనా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయనను సస్పెండ్ చేసిన తర్వాత, తదుపరి చర్యలు తీసుకునే వరకు ఆయన ఏ కేసులను విచారించలేరు.

వీడియో ఇక్కడ చూడండి.. 

ఇదిలావుంటే, అక్టోబర్ 6, 2025న, సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో ఒక సాధారణ విచారణ సందర్భంగా, రాకేష్ కిషోర్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో తల తెగిపోయిన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించడానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఉదయం 11:35 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కిషోర్ తన షూతో గవాయ్‌పై దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సమీపంలోని న్యాయవాదులు రాకేష్ కిషోర్‌ను పట్టుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..