విషమంగానే అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తోన్న వైద్యులు

కాంగ్రెస్ సీనియర్‌ నేత, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు

  • Tv9 Telugu
  • Publish Date - 4:42 pm, Sun, 22 November 20
విషమంగానే అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తోన్న వైద్యులు

Tarun Gogoi Health: కాంగ్రెస్ సీనియర్‌ నేత, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు గువాహటి మెడికల్‌ కాలేజ్‌ సూపరింటెండెంట్‌ అభిజీత్‌ శర్మ తెలిపారు. తరుణ్‌ శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించడంతో శనివారం సాయంత్రం ఆయనను గువాహటి మెడికల్‌ కాలేజీలో చేర్చారు. ఇక నిన్నటితో పోలిస్తే గొగొయి ఆరోగ్యం ఇవాళ కాస్త మెరుగుపడిందని అభిజిత్‌ పేర్కొన్నారు. (ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్‌కి అలవాటు పడ్డట్లున్నారు.. సినిమా పరిశ్రమ ఎటు పోతోందో తెలీడం లేదు)

కాగా అక్టోబర్‌లో అయాసం రావడంతో గువాహటి మెడికల్‌ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తరువాత జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక ప్లాస్మా థెరపీ చేయడంతో ఆయన కోలుకోగా.. గత నెల 25న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే పలు అవయవాల పనితీరు క్షీణించడంతో మరోసారి ఆయనను శనివారం ఆసుపత్రిలో చేర్చారు. (అర్హ బర్త్‌డే వేడుకలు చేసిన పుష్ప నిర్మాతలు.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన బన్నీ)