విదేశీ గోవులు ‘ఆంటీలు’.. కావాలంటే కుక్కను కూడా తినండి

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం తినాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్దావన్‌లో సోమవారం జరిపిన గోపా అష్టమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆవు తల్లిలాంటిదని.. అలాంటి తల్లిని చంపిన వారిని తాము సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తామని అన్నారు. “ఆవు తల్లిలాంటిది. మన దేశీ ఆవులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి పాలలో బంగారం కలిసి ఉంటుంది.. అందుకే అవి బంగారం రంగులో […]

విదేశీ గోవులు 'ఆంటీలు'.. కావాలంటే కుక్కను కూడా తినండి
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 5:28 PM

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం తినాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్దావన్‌లో సోమవారం జరిపిన గోపా అష్టమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆవు తల్లిలాంటిదని.. అలాంటి తల్లిని చంపిన వారిని తాము సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తామని అన్నారు.

“ఆవు తల్లిలాంటిది. మన దేశీ ఆవులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి పాలలో బంగారం కలిసి ఉంటుంది.. అందుకే అవి బంగారం రంగులో ఉంటాయి. మన ఆవుల్లో ఉన్న ప్రత్యేక రక్తనాళాలు సూర్యుడి సహాయంతో బంగారాన్ని తయారు చేయగలవు. అందుకే ఆ గోవులను మనం పెట్టుకోవాలి. దేశీ గోవు పాలు తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాం” అని అన్నారు. అంతటితో ఆగకుండా విదేశీ నుంచి మనం దిగుమతి చేసుకునే ఆవులు ఆవులు కాదు. అవి మన గోమాతలు కాదు కానీ ఆంటీలు. వాటిని పూజిస్తే దేశానికే మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక “మేధావులంతా చెప్పుకున్న కొంతమంది రోడ్లపై బీఫ్ తింటున్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా. కుక్కు మాంసం కూడా తినండి. మీ ఆరోగ్యానికి ఏది మంచిది అనిపిస్తే దాని మాంసం తినండి. కానీ రోడ్ల మీద కాదు. మీ ఇంట్లో తినండి అని కామెంట్లు చేశారు. తల్లిలాంటి ఆవును చంపినట్లైతే మేము సహించబోం” అని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ తన వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు దిలీప్ ఘోష్.

ఇదిలా ఉంటే దేశీ ఆవుల పాలల్లో బంగారం ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన సైన్స్ టీచర్ ఎవరో కనుక్కోండి.. త్వరలో మదర్ డైరీ జ్యువెలర్స్ వస్తాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.