REET 2021: సంచలనం..పరీక్షల కోసం అక్కడ మొబైల్ నెట్ వర్క్ బంద్ చేసిన ప్రభుత్వం.. ఎక్కడంటే..

ఎప్పుడైనా పరీక్షల్లో కాపీలు కొట్టడానికి కొందరు విద్యార్ధులు రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వమూ అడ్డుకుంటూ పరీక్షలు నిర్వహిస్తోంది.

REET 2021: సంచలనం..పరీక్షల కోసం అక్కడ మొబైల్ నెట్ వర్క్ బంద్ చేసిన ప్రభుత్వం.. ఎక్కడంటే..
Mobile Network
Follow us

|

Updated on: Sep 26, 2021 | 8:19 PM

REET 2021: ఎప్పుడైనా పరీక్షల్లో కాపీలు కొట్టడానికి కొందరు విద్యార్ధులు రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. గతంలో చిట్టీలు.. తరువాత మొబైల్ ద్వారా సందేశాలతో కాపీలు.. తరువాత నేరుగా ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో మొబైల్ నెట్ ద్వారా కాపీ విధానం ఆధునిక పోకడలకు పోయింది. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వమూ అడ్డుకుంటూ పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా కొన్ని పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినుల చెవి రింగులు కూడా పరీక్షా హాలులోకి అనుమతి ఇవ్వడం లేదు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు దేశంలో ఇప్పటివరకూ కనీ, వినీ ఎరుగని విధంగా ఏకంగా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో మొబైల్ నెట్ వర్క్ ఆపివేసిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది.

ఇది రాజస్థాన్ లో జరిగింది. అక్కడ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష రీట్ ఎగ్జామ్ 2021ఈరోజు (సెప్టెంబర్ 26 ఆదివారం) నిర్వహించారు. ఈ పరీక్షల కోసం రాజస్థాన్ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ మరియు SMS/MMS సేవలను నిలిపివేసింది.

రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష -రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా రీట్ – నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ మరియు SMS/MMS సేవలను నిలిపివేసింది. అజ్మీర్, అల్వార్, దౌసా, ఝున్ ఝును, జైపూర్ రూరల్ జిల్లాలలో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో లేకుండా చేశారు. అంతకు ముందే ప్రభుత్వ యంత్రాంగం ”REET నేపథ్యంలో సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ సర్వీస్‌లు, బల్క్ SMS/MMS, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇతర సోషల్ మీడియా (ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్ మరియు ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ వాయిస్ కాల్ మినహా) నిలిపివేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. 31,000 కి పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఆదివారం REET జరిగింది. రాజస్థాన్‌లోని దాదాపు 4,000 కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షలో 16 లక్షలకు పైగా అభ్యర్థులు తమ భవితవ్యం కోసం పరీక్షలు రాశారు. రాష్ట్రంలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత REET నిర్వహించారు. రాష్ట్రంలో 200 చోట్ల ఏర్పాటు చేసిన 4,153 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేశారు. ఒక్క జైపూర్ జిల్లాలోనే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు 592 కేంద్రాల్లో పరీక్ష రాశారు.

ఇక రీట్ కోసం హాజరయిన అభ్యర్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించింది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి పేపర్ లీక్ లేదా కాపీ చేయడం గమనించినట్లయితే, వారిని సర్వీస్ నుండి తొలగిస్తామని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. అలాగే, ఏదైనా ప్రైవేట్ పాఠశాల సిబ్బంది లేదా పాఠశాలకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం కనుగొనబడితే, ఆ పాఠశాల గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గెహ్లాట్ చెప్పారు.

మొత్తంమ్మీద రాజస్థాన్ ప్రభుత్వం చేసిన ఈ పని సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అన్ని ముఖ్యమైన పరీక్షల నిర్వహణలో మిగిలిన రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించే అవకాశం కనిపిస్తోంది.

Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..

Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం