Medicine by Drones: దేశంలోనే తొలిసారిగావిజయవంతంగా డ్రోన్ ద్వారా మందుల డెలివరీ.. ఎక్కడంటే..

డ్రోన్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో పెద్ద ముందడుగు పడింది. అత్యవసర మందులను మారుమూల ప్రాంతాలకు వేగంగా సురక్షితంగా చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి.

Medicine by Drones: దేశంలోనే తొలిసారిగావిజయవంతంగా డ్రోన్ ద్వారా మందుల డెలివరీ.. ఎక్కడంటే..
Medicine Delivery With Drone
Follow us

|

Updated on: Nov 27, 2021 | 7:13 AM

Medicine by Drones: డ్రోన్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో పెద్ద ముందడుగు పడింది. అత్యవసర మందులను మారుమూల ప్రాంతాలకు వేగంగా సురక్షితంగా చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. మేఘాలయ రాష్ట్రంలో డ్రోన్ ద్వారా 25 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మందులను శుక్రవారం (నవంబర్ 26) సరఫరా చేశారు. దీంతో మేఘాలయ డ్రోన్ టెక్నాలజీని అత్యవసర మందుల డెలివరీలో ఉపయోగించుకున్న తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తెలిపారు.

కాన్రాడ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఆయన ”ఈరోజు మేము మేఘాలయలోని మావెట్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నాంగ్‌స్టోయిన్ నుండి e-VTOL డ్రోన్ ద్వారా మందులను సరఫరా చేసాము. ఈ రకమైన మొదటి కార్యక్రమంలో, డ్రోన్ 25 నిమిషాల కంటే తక్కువ సమయంలో 25 కి.మీ. దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి మందులను పంపించ గలిగాము. భారతదేశంలోనే ఈ తరహా కార్యక్రమం ఇదే మొదటిది. డ్రోన్ సాంకేతికత ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును మార్చగలదు” అని ఆయనతన పోస్ట్ లో పేర్కొన్నారు. రవాణా సదుపాయాలూ అందుబాటులో లేని క్లిష్టమైన ప్రాంతాలకు మందుల సరఫరాను సులభతరం చేసే ఏకైక ప్రాజెక్ట్ ఇది.

ఈశాన్య ప్రాంతంలో డ్రోన్‌లు యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ల సరఫరాను ప్రారంభించాయి

గత నెలలో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈశాన్య ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. ఐసీఎంఆర్(ICMR) డ్రోన్ రెస్పాన్స్, ఔట్రీచ్ ఇన్ ది నార్త్ ఈస్ట్ (ఐ-డ్రోన్) కార్యక్రమం.. ప్రాణాలను రక్షించే కోవిడ్ వ్యాక్సిన్‌లు ప్రతి ఒక్కరికీ చేరేలా చూసేందుకు సరఫరా నమూనా అని అధికారులు తెలిపారు. దేశంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా టీకాలు చేరువ కావాలనే లక్ష్యంతో ఆరోగ్యంలో ‘అంత్యోదయ’ పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.

కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను 12-15 నిమిషాల్లో 15 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశానికి అందించడానికి దక్షిణాసియాలో ‘మేక్ ఇన్ ఇండియా’ డ్రోన్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని మాండవ్య చెప్పారు. ఈ వ్యాక్సిన్‌లను మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రి నుండి పిహెచ్‌సిలోని లబ్ధిదారులకు ఇంజెక్షన్ కోసం కరంగ్ దీవిలోని లోక్‌తక్ సరస్సుకు రవాణా చేశారు.

మాండవ్య మాట్లాడుతూ, ఈ ప్రాంతాల మధ్య రహదారి ద్వారా వాస్తవ దూరం 26 కి.మీ. నేడు పీహెచ్‌సీలో 10 మంది లబ్ధిదారులకు మొదటి డోస్‌, ఎనిమిది మందికి రెండో డోసు అందనుంది అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రి, ఆయన నాయకత్వంలో దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు, ఇది సాంకేతికత జీవితాన్ని ఎలా సులభతరం చేస్తుందో అదేవిధంగా సామాజిక మార్పును ఎలా తీసుకువస్తుందో మాకు చూపించింది అని తెలిపారు.

భారతదేశం భౌగోళిక వైవిధ్యాల దేశమని, డ్రోన్‌ల ద్వారా నిత్యావసర వస్తువులను చివరి మైలు వరకు పంపిణీ చేయవచ్చని ఆయన అన్నారు. మాండవ్య మాట్లాడుతూ, ముఖ్యమైన ప్రాణాలను రక్షించే మందులను పంపిణీ చేయడానికి, రక్త నమూనాలను సేకరించడానికి మేము డ్రోన్‌లను ఉపయోగించవచ్చు. ఈ సాంకేతికత తీవ్రమైన పరిస్థితులలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణలో సవాళ్లను పరిష్కరించడంలో ఈ సాంకేతికత ముఖ్యమైనదని నిరూపించవచ్చు, ముఖ్యంగా కష్టతరమైన ప్రాంతాల్లో ఆరోగ్య పంపిణీకి ఇది పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు అని మాండవ్య వివరించారు.

ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే.. 

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?