తల్లికి తగ్గ తనయ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ కుమార్తె.. ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు వేడుకల్లో ఏంచేసిందంటే!

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్.. తన తల్లి ఎంతో ఇష్టపడే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీని 94వ జన్మదినం సందర్భంగా ఆయనను కలుసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తల్లికి తగ్గ తనయ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ కుమార్తె.. ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు వేడుకల్లో ఏంచేసిందంటే!
Sushma Swaraj's Daughter In Lk Advani's Birthday
Follow us

|

Updated on: Nov 09, 2021 | 8:12 PM

LK Advani’s Birthday: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్.. తన తల్లి ఎంతో ఇష్టపడే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీని 94వ జన్మదినం సందర్భంగా ఆయనను కలుసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తన వెంట చాక్లెట్ కేక్‌ను తీసుకువెళ్లి ఆయన చేత కట్ చేయించారు. సుష్మ స్వరాజ్ రాజకీయాలు, పాలనాతీరులో ఎంత చురుకుగా వ్యవహరించే వారో.. అనుబంధాలకూ అంతే ప్రాముఖ్యతనిచ్చారు. ఆమె జీవించి ఉన్న ప్రతీ ఏడాది తప్పకుండా అద్వానీ ఇంటికి చాక్లెట్‌ కేకు తీసుకొచ్చి కట్ చేయించి ఆరోజును పండుగలా నిర్వహించేవారు. సరిగ్గా అదే పద్ధతిని ఇప్పుడు కూతురు కొనసాగిస్తుండటం అందరినీ ఆకట్టుకుంది.

“గౌరవనీయమైన అద్వానీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని స్వరాజ్ ట్విట్టర్‌లో అద్వానీతో ఉన్న ఫోటోతో పాటు పోస్ట్ చేశారు.”మా అమ్మ ఏటా రాఖీ పండుగ రోజు, ఆత్మీయుల పుట్టినరోజు నాడు వాళ్లింటికెళ్లి వేడుకలు చేసేవారు. ఆ సాంప్రదాయాన్నే ఇప్పుడు నేను కొనసాగిస్తున్నా’’ అంటూ తల్లిని గుర్తుచేసుకున్నారు బాన్సురి స్వరాజ్‌.

ఇదిలావుంటే, 2019 సుష్మా స్వరాజ్‌ గుండెపోటుతో మరణించారు. మరణానంతరం ఆమెకు 2020లో పబ్లిక్ అఫైర్స్ రంగంలో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘‘పద్మవిభూషణ్’’ లభించింది. సుష్మాస్వరాజ్‌‌కు మరణాంతరం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ సోమవారంనాడు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.

మరోవైపు, గతంలోనూ సుష్మా స్వరాజ్ చివరి కోరికను ఆమె కుమార్తె బన్సూరి నెరవేర్చారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసు వాదించి గెలిచినందుకు న్యాయవాది హరీశ్ సాల్వేకు సుష్మా ఇవ్వాల్సిన రూ.1 ఫీజును బన్సూరి చెల్లించారు. హరీశ్ సాల్వేకు ఫీజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ అంటూ బన్సూరి గతంలో ట్వీట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ కేసు వాదించి గెలిచినందుకు సుష్మా హరీశ్ సాల్వేకు రూ.1 ఫీజుగా చెల్లిస్తానన్నారు. ఈ నేపథ్యంలో చనిపోవడానికి గంట ముందుహరీశ్ సాల్వేకు సుష్మా ఫోన్ చేశారు. మీకు చెల్లించాల్సిన ఫీజును వచ్చి తీసుకెళ్లండని చెప్పారు. దానికి హరీశ్ సాల్వే.. మీరు నాకిచ్చే విలువైన బహుమతిని కచ్చితంగా స్వీకరిస్తాను అని చెప్పారు. కానీ ఆ తర్వాత గంటకే సుష్మా కన్నుమూశారు. సుష్మా చివరి కోరిక అలాగే ఉండిపోవడంతో.. ఆమె కూతురు బన్సూరి హరీశ్ సాల్వేను కలిసి రూ.1ఫీజును చెల్లించేశారు. తల్లి కోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

కాగా,గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌ జైల్లో బంధిగా ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపుదల చేస్తూ.. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో హరీశ్‌ సాల్వే కుల్‌భూషణ్ జాదవ్ తరుపున తన వాదనను బలంగా వినిపించారు. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానం ఆయన వాదనతో ఏకీభవించి మరణశిక్షను నిలుపుదల చేసింది. Read Also… VC Sajjanar: అల్లు అర్జున్‌ ర్యాపిడో యాడ్‌పై ఆర్టీసీ అభ్యంతరం.. స్టైలిష్‌ స్టార్‌కు లీగల్‌ నోటీసులు పంపిన సజ్జనార్‌..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!