Azadi Ka Amrit Mahotsav: హర్‌ ఘర్‌ తిరంగా సర్టిఫికెట్‌ ఎలా పొందాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు..

Azadi Ka Amrit Mahotsav: దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే..

Azadi Ka Amrit Mahotsav: హర్‌ ఘర్‌ తిరంగా సర్టిఫికెట్‌ ఎలా పొందాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు..
Har Ghar Tiranga
Narender Vaitla

|

Aug 15, 2022 | 8:14 AM

Azadi Ka Amrit Mahotsav: దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందరినీ భాగం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రజలు తమ, తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ఎగరవేసిన చాలా మంది తమ సోషల్‌ మీడియా సైట్స్‌లో హర్‌ ఘర్‌ తిరంగా సర్టిఫికెట్‌ను షేర్‌ చేస్తున్నారు. మీరు కూడా ఇది గమనించే ఉంటారు. ఇంతకీ ఈ సర్టిఫికేట్‌ను ఎలా పొందాలి? ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్స్‌ మీకోసం..

* ముందుగా వెబ్‌ బ్రౌజర్‌లో harghartiranga.comను ఓపెన్‌ చేయాలి.

* తర్వాత ‘Pin a flag’ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి.

* అనంతరం వెబ్‌సైట్ లొకేషన్ యాక్సెస్‌ అడుగుతుంది దానికి అనుమతించాలి.

* ప్రొఫైల్‌ పిక్‌ను సెట్‌ చేసిన తర్వాత పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్‌ చేయాలి.

* మీరు జెండా ఆవిష్కరించిన ఫొటోను అప్‌లోడ్‌ చేసి ‘నెక్ట్స్‌’ బటన్‌పై నొక్కాలి.

* అనంతరం మ్యాప్‌లో మీ లొకేషన్‌ను సరిగ్గా సెట్‌ చేసి ‘పిన్‌ ఏ ఫ్లాగ్‌’పై క్లిక్‌ చేయాలి.

* చివరిగా మీ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని స్వాతంత్ర్య దినోత్సవ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu