నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్.. కీలక అంశాల ప్రకటన

నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్.. కీలక అంశాల ప్రకటన

కరోనా మహమ్మారి ప్రభావంతో.. దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ వివరాలను బుధవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వివరించారు. తాజాగా గురువారం కూడా మరోసారి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Rajesh Sharma

May 14, 2020 | 6:28 PM

కరోనా మహమ్మారి ప్రభావంతో.. దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ వివరాలను బుధవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వివరించారు. తాజాగా గురువారం కూడా మరోసారి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ గురించి.. రెండో రోజు వివరాలను వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపుల గురించి వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగ కల్పన తదితర విభాగాలకు కేటాయించిన వాటి గురించి తెలిపారు.

ఈ సందర్భంగా.. ఇన్‌ టైంలో లోన్స్ చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీపై రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సన్న కారు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటుగా.. గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అంతేకాదు.. ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే విధంగా కనీస వేతనం అమలయ్యేలా చూస్తామన్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా.. ఆగస్టు నుంచి వన్ నేషన్ వన్ కార్డు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu