Breaking : కశ్మీర్‌లో ఐసీస్ మాడ్యూల్.. భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

దేశంలో అలజడి సృష్టించేందుకు పక్కా స్కెచ్ వేసిన ఐసీస్‌కు జమ్ముకశ్మీర్‌ పోలీసులు చెక్ పెట్టారు. ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తూ.. దేశంలో భారీ దాడులకు ప్రయత్నిస్తున్న ఐదుగురు “ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్ముకశ్మీర్‌” (ISJK)కు సంబంధించిన ఐదుగురు టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని బుడ్గాం జిల్లాలో వీరిని అరెస్ట్ చేశారు. వీరికి ఐసీస్‌తో పాటుగా.. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరు దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులకు వాహన సౌకర్యంతో పాటుగా.. వారు ఉండేందుకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:09 am, Thu, 13 February 20
Breaking : కశ్మీర్‌లో ఐసీస్ మాడ్యూల్.. భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

దేశంలో అలజడి సృష్టించేందుకు పక్కా స్కెచ్ వేసిన ఐసీస్‌కు జమ్ముకశ్మీర్‌ పోలీసులు చెక్ పెట్టారు. ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తూ.. దేశంలో భారీ దాడులకు ప్రయత్నిస్తున్న ఐదుగురు “ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్ముకశ్మీర్‌” (ISJK)కు సంబంధించిన ఐదుగురు టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని బుడ్గాం జిల్లాలో వీరిని అరెస్ట్ చేశారు. వీరికి ఐసీస్‌తో పాటుగా.. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరు దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులకు వాహన సౌకర్యంతో పాటుగా.. వారు ఉండేందుకు షెల్టర్‌లను ఏర్పాటు చేస్తున్నారని తేలింది. వీరివద్ద నుంచి భారీగా పేలుడు పదార్ధాలతో పాటుగా.. అత్యాధునిక వెపన్స్ సీజ్ చేశారు. అరెస్ట్ అయిన ఐదుగుర్ని.. షాన్‌వాజ్ అహ్మద్ వనీ, నాసీర్ అహ్మద్ వనీ, బిలాల్ అహ్మద్ ఖాన్, ఇర్ఫాన్ అహ్మద్ పఠాన్, అలీ మహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరిలో షాన్‌వాజ్ అహ్మద్ వనీ, నాసీర్ అహ్మద్ వనీ, బిలాల్ అహ్మద్ ఖాన్, ఇర్ఫాన్ అహ్మద్ పఠాన్‌లు బీర్వాహ్‌లోని గుండిపొరకు చెందిన వారు కాగా.. అలీ మహ్మద్ భట్‌ వరీహమాకు చెందిన వాడని పేర్కొన్నారు.