మంచులో కేదార్ నాథ్ భక్తుల ప్రయాణం.. ఎందుకంటే ?

ఉత్తరాఖండ్ లో అయిదుగురు కేదార్ నాథ్ భక్తులు 'భక్తిపూర్వక సాహసమే చేశారు'. ఈ నెల 29 న కేదార్ నాథ్ ఆలయం తెరచుకోనుండగా వారు మంగళవారమే పంచముఖ డోలీ యాత్రకు పూనుకొన్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా భక్తులెవరూ రాకపోయినా చలిలో...

  • Umakanth Rao
  • Publish Date - 10:49 am, Tue, 28 April 20
మంచులో కేదార్ నాథ్ భక్తుల ప్రయాణం.. ఎందుకంటే ?

ఉత్తరాఖండ్ లో అయిదుగురు కేదార్ నాథ్ భక్తులు ‘భక్తిపూర్వక సాహసమే చేశారు’. ఈ నెల 29 న కేదార్ నాథ్ ఆలయం తెరచుకోనుండగా వారు మంగళవారమే పంచముఖ డోలీ యాత్రకు పూనుకొన్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా భక్తులెవరూ రాకపోయినా చలిలో.. గజగజ వణకుతూనే.. 10 అడుగుల మందంతో పేరుకుపోయిన మంచులోనే నడుస్తూ.. చిన్న పల్లకిలో పంచ ముఖ విగ్రహాన్ని ‘ఊరేగింపుగా’ తీసుకువెళ్లారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా సాధారణంగా ప్రతి ఏడాదీ సుమారు వెయ్యి మంది భక్తులతో దీన్ని సైన్యంలోని కుమావో బెటాలియన్ నిర్వహిస్తుంది. అయితే ఈ సారి కేవలం ఈ అయిదుగురు భక్తులే యాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. ఉత్తరాఖండ్ లోని నాలుగు ఆలయాలను మళ్ళీ తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.

గర్వాలీ హిమాలయాల్లో గంగోత్రి, యమునోత్రి, ఆలయాలను శనివారం నాడే తెరిచారు. ఎత్తయిన హిమాలయాలపై ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బదరీ నాథ్ లను అన్నింటినీ కలిపి చార్ ధామ్ యాత్రగా వ్యవహరిస్తారు.