రైళ్లు దిగిన ప్యాసింజర్లకు కష్టాలు.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అంతా దిగాలు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని స్పెషల్ రైళ్లను కేంద్రం అనుమతించింది. అయితే బుధవారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో దిగిన ప్రయాణికులు, వలస కూలీలకు 'చుక్కలు కనిపించాయి'. బస్సులు గానీ, ఆటోలు గానీ ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేక...

రైళ్లు దిగిన ప్యాసింజర్లకు కష్టాలు.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అంతా దిగాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 13, 2020 | 1:14 PM

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని స్పెషల్ రైళ్లను కేంద్రం అనుమతించింది. అయితే బుధవారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో దిగిన ప్రయాణికులు, వలస కూలీలకు ‘చుక్కలు కనిపించాయి’. బస్సులు గానీ, ఆటోలు గానీ ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేక వారు నానా ఇబ్బందులు పడ్డారు. రాజేంద్ర నగర్, ముంబై సెంట్రల్, అహమ్మదాబాద్ నుంచి మూడు రైళ్లు ఇక్కడికి చేరుకున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్ నుంచి వఛ్చిన వలస కూలీలు కూడా ఈ ప్రయాణికుల్లో ఉన్నారు. రైల్వే స్టేషన్ నుంచి తమ ప్రాంతాలకు బస్సులు ఉంటాయని ఊహించిన వీరికి షాక్ తగిలింది. ఒక్క బస్సు కూడా వీరికి కనిపించలేదు. పరిమితంగా ఉన్న టాక్సీవాలాలు తక్కువ దూరానికి కూడా హెచ్చు చార్జీలు డిమాండ్ చేయడంతో వీరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఓలా, ఉబెర్ ఆటోలకోసం  కొంతమంది ప్రయాణికులు ప్రయత్నించినా అవి కూడా అందుబాటు లోకి రాలేదు. ముఖ్యంగా పిల్లలతో వఛ్చిన ప్రయాణికుల కష్టాలు చెప్పనలవి కాదు. చాలా మంది కాలినడకనే ఇంటిబాట పట్టారు.