ఘజియాబాద్‌లోని ప్యాకేజింగ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు దేశంలో ఎక్కడో ఓ చోట ఇతర ప్రమాదాలు కూడా కలవరపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు..

ఘజియాబాద్‌లోని ప్యాకేజింగ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 10:52 AM

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు దేశంలో ఎక్కడో ఓ చోట ఇతర ప్రమాదాలు కూడా కలవరపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యూపీలో గురువారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం టుచేసుకుంది. ఘజియాబాద్‌లోని సహిబాబాద్‌ల పారిశ్రామిక వాడలోని ప్యాకేజింగ్‌ ఫ్యాక్టరీలో తెల్లవారు జామున 4.00 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న కార్డుబోర్డు బాక్సులు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక శాఖకి సమాచారం అందించడంతో.. వెంటనే వారు రంగంలోకి దిగారు. ఎనిమిది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఎలాంటి ప్రాణనష్టం కూడా జరగలేదని తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.