దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు.. రీజన్ ఇదే..

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు.. రీజన్ ఇదే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 2:55 PM

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో పోలీసులు దిగ్విజయ్ సింగ్‌తో పాటు మరో 150 మంది కార్యకర్తలపై.. ఐపీసీ సెక్షన్ 341,188,134,269 మరియు 270 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుధవారం నాడు.. రాష్ట్రంలోని రోషన్ పుర జంక్షన్ నుంచి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇంటి వద్దకు వెళ్లేందుకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కరోనా విపత్తులో పెట్రోల్‌పై ధరలు పెంచుతూ.. సామాన్యులపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని.. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వరుసగా పద్దెనిమిది రోజులుగా పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోవడం.. ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. కరోనా విపత్తులో ఖర్చు చేసిన ధనాన్ని.. ఇప్పుడు మళ్లీ ప్రజల వద్దనుంచి పెట్రోల్‌తో బాదుతుందన్నారు. వెంటనే పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.