Farmers Protest: మే నెలలో పార్లమెంట్ మార్చ్.. సంయుక్త కిసాన్ మోర్చా కీలక నిర్ణయం..

Farm Laws - Parliament March: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపు నాలుగు నెలలుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు

Farmers Protest: మే నెలలో పార్లమెంట్ మార్చ్.. సంయుక్త కిసాన్ మోర్చా కీలక నిర్ణయం..
farmers protest
Follow us

|

Updated on: Apr 01, 2021 | 3:23 AM

Farm Laws – Parliament March: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపు నాలుగు నెలలుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం సవరణలకే మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా మే నెలలో చలో పార్లమెంట్‌కు పిలుపు నిచ్చినట్లు 40 రైతుల సంఘాల వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా బుధవారం ప్రకటించింది. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలో నిర్ణయిస్తామంటూ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 10న కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధించనున్నట్లు పేర్కొన్నారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను పలు రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన టిక్రి, సింఘు, ఘాజీపూర్‌ వద్ద నాలుగు నెలల నుంచి నిరసన తెలుపుతున్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు జరిగిన 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. ఆ చర్చలన్నీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సవరణలకు ఒప్పుకుంటే.. చర్చలకు సిద్ధమంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.

ఈ క్రమంలో జనవరి 26న రిపబ్లి డే రోజున నిర్వహించిన ట్రాక్టర్స్‌ ర్యాలీ ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇదిలాఉంటే.. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను బుధవారం సమర్పించింది. సీల్డ్ కవర్‌లో పలువురి అభిప్రాయాలను కమిటీ సభ్యులు సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించారు.

Also Read:

Deen Dayal awards – 2021: తెలుగు రాష్ట్రాలకు జాతీయ అవార్డుల పంట.. ఏయే పంచాయతీలకు వచ్చాయంటే..? వివరాలు

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ