రైతుల ఆందోళనపై సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విచారణ.. క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్న ధ‌ర్మాస‌నం

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రైతుల ఆందోళనలపై ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని ధ‌ర్మాస‌నం...

  • Subhash Goud
  • Publish Date - 1:49 pm, Thu, 17 December 20
రైతుల ఆందోళనపై సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విచారణ.. క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్న ధ‌ర్మాస‌నం

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రైతుల ఆందోళనలపై ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. సామ‌ర‌స్య ప‌రిష్కారం కోసం క‌మిటీ ప‌ని చేస్తుంద‌ని అన్నారు. అయితే రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని,  నిరసలు శాంతియుతంగా సాగాలి త‌ప్ప హింస‌కు తావుండ‌రాద‌ని సుప్రీం కోర్టు సీజే తెలిపారు. రైతుల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని మొండి ప‌ట్టుద‌ల‌తో కూర్చున్నార‌ని, ర‌ద్దు త‌ప్ప మ‌రేం వ‌ద్దంటే చ‌ర్చ‌ల‌తో కూడా ఏ మాత్రం ఉప‌యోగం లేద‌ని అట‌ర్నీ జ‌న‌ర‌ల్ వ్యాఖ్యానించారు.

చ‌ర్చ‌ల‌కు రావాల‌ని న్యాయ‌స్థానం రైతుల‌ను ఆదేశించాల‌ని తెలుప‌గా, అందుకే మేం క‌మిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని సీజే పేర్కొన్నారు. 22 రోజులుగా ర‌హ‌దారిని దిగ్బంధం చేయ‌డంతో తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని, ప్ర‌జ‌లు త‌మ ఉద్యోగాలు చేసుకోలేక‌పోతున్నారి, అంబులెన్స్‌ల‌ను సైతం క‌ద‌ల‌నివ్వ‌డం లేద‌ని అట‌ర్నీ జ‌న‌ర‌ల్ అన్నారు. పైగా ఇప్పుడు దేశంలో క‌రోనా వైర‌స్ ముప్పు ఎక్కువ‌గా ఉంద‌ని, రైతులు ఇళ్ల‌కు చేరితే క‌రోనా మ‌రింత వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.