హర్యానాలో మళ్ళీ అన్నదాతల ఆందోళన.. పోలీసులతో ఘర్షణ.. బ్యారికేడ్ల ధ్వంసం , అరెస్టులు

హర్యానాలోని సిర్సా లో శనివారం అన్నదాతలు మళ్ళీ తీవ్ర ఆందోళనకు దిగారు. తమ సహచరులపై పెట్టిన దేశద్రోహం కేసులను ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..ఈ జిల్లాలో పోటెత్తారు.

హర్యానాలో మళ్ళీ అన్నదాతల ఆందోళన.. పోలీసులతో ఘర్షణ.. బ్యారికేడ్ల  ధ్వంసం , అరెస్టులు
Farmers Protest Against Arrests In Sedition Case, Police On High Alert In Sirsa District
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 17, 2021 | 5:56 PM

హర్యానాలోని సిర్సా లో శనివారం అన్నదాతలు మళ్ళీ తీవ్ర ఆందోళనకు దిగారు. తమ సహచరులపై పెట్టిన దేశద్రోహం కేసులను ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..ఈ జిల్లాలో పోటెత్తారు. వీరిని అడ్డగించేందుకు పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను కూడా విరగ గొట్టారు. భారీ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలు ఉన్నప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కోరుతున్న వీరు హర్యానాలో బీజేపీ, దాని మిత్ర పక్షాల నేతలను, వారి కాన్వాయ్ లను అడ్డుకుంటున్నారు., ఈ నెల 11 న బీజేపీ నేత, హర్యానా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రణదీప్ గాంగ్వా కారుపై దాడి జరిపి కారు అద్దాలను రైతులు పగులగొట్టారు..ఆయన కాన్వాయ్ ని అడ్డగించి వెనుతిరిగిపోవాలంటూ నినాదాలు చేశారు.ఆ సందర్భంగా పోలీసులు 100 మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు పెట్టారు. అయిదుగురు రైతులను అరెస్టు చేశారు.\

వారి విడుదలకు సంబంధించి, తమ ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు 20 మంది సభ్యులతో వీరు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొన్నారు. తమ సహచరులపై పెట్టినదేశద్రోహం కేసులు తప్పుడు కేసులని, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ మోర్చా నాయకులు పేర్కొన్నారు. కాగా శనివారం బ్యారికేడ్లను విరగగొట్టి ముందుకు వస్తున్న అనేకమంది అన్నదాతలను పోలీసులు, పారా మిలిటరీ బలగాలు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇలా ఉండగా దేశద్రోహం కేసులు, ఇందుకు సంబంధించిన చట్టం ఇప్పుడు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వేళ వీరి అరెస్టులు, హర్యానా ప్రభుత్వ తీరు, పోలీసుల ప్రవర్తన ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : ఇన్ ఫ్రంట్.. దేరీజ్ థర్డ్ వేవ్..!కరోనా థర్డ్ వేవ్ పై WHO హై అలెర్ట్ : WHO warns Covid-19 third wave Video.

 రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.

 భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.

 భూమీద నూకలున్నాయి అందుకే బ్రతికాడు..తృటిలో తప్పిన ప్రమాదం..అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వ్యక్తి పై పడిన చెట్టు:Mahbhubnagar video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu