నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు 4వ విడత చర్చలు జరపనుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 8:18 am, Thu, 3 December 20
నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు 4వ విడత చర్చలు జరపనుంది. ఈనెల 1న జరిపిన చర్చల్లో చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనను రైతు ప్రతినిధులు తిరస్కరించారు. కాగా ఇవాళ రైతులతో చర్చలకు ముందు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌తో అమిత్ షా భేటీ కానున్నారు.  విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో చర్చలు ప్రారంభం అవ్వనున్నాయి.  మొత్తం 35 రైతు సంఘాల నేతలతో ఈ రోజు ప్రభుత్వం మరోసారి కీలక చర్చలు జరపనుంది.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని  రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో జాతీయ రహదారుల పైనే కొనసాగుతున్న వేలాది రైతుల బైఠాయించి నిరసనను కొనసాగిస్తున్నారు.  “కనీస మద్దతు ధర” వ్యవసాయ చట్టంలో భాగమే కాదన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, దాని  అమలుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయన్నాయని స్పష్టం చేశారు.  ఈ విషయంలో రైతులకు అనుమానాలు, అపోహలు, భయాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఇది కేవలం పంజాబ్, మరికొన్ని రాష్ట్రాలకే పరిమితమైన అంశం కాదన్న రైతు సంఘాల నేతలు..దేశవ్యాప్త ఆందోళనలకు రైతు శక్తిని ఏకం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే సరిహద్దులను మూసివేశారు అధికారులు. మంగళవారం చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు మరింత సంఘటితమయ్యాయి. ఆందోళన ను ఉధృతం చేయాలనే ఉద్దేశంతో వారు సమాలోచనలు చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు భేటీలో అయినా చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Also Read :

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి