Corona XE variant: కరోనా ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. కేంద్ర మంత్రి హెచ్చరిక

దేశంలో కరోనా(Corona in India) కేసులు తగ్గుతున్నా కొవిడ్ కొత్త వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కేసుల తగ్గుదలతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. అయితే ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని,....

Corona XE variant: కరోనా ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. కేంద్ర మంత్రి హెచ్చరిక
Corona
Follow us

|

Updated on: Apr 13, 2022 | 8:28 AM

దేశంలో కరోనా(Corona in India) కేసులు తగ్గుతున్నా కొవిడ్ కొత్త వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కేసుల తగ్గుదలతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. అయితే ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని, కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా బయటపడిన XE వేరియంట్ ను తేలికగా తీసుకోవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్ మాండవియా(Union Minister (Mansukh Mandaviya)హెచ్చరించారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి, ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు కేసులపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల కొరత ఏర్పడకుండా చూసుకోవాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. 12 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు ప్రారంభించే విషయంలో నిపుణులతో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 60 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వ కేంద్రాల్లో టీకా ఉచితంగా అందిస్తామని వివరించారు.

ప్రస్తుతం దేశంలో వైరస్​ వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికీ ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర మంత్రి మాండవియా మరో సారి అన్నారు. దేశంలో టీకాకు అర్హత కలిగిన ప్రజల్లో 97 శాతం మందికి ఇప్పటికే మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని వివరించారు. మరోవైపు.. కొవిడ్​-19 కొత్త ‘ఎక్స్​ఈ’ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ అన్ని వేరియంట్ల కన్నా ఈ వేరియంట్ ప్రభావవంతమైనదని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Also Read

Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? ఉసిరితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..

Best Fridge: 5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. వేసవిలో విద్యుత్ బిల్లు చాలా ఆదా అవుతుంది..

Travel tips: భారతదేశంలోని 5 అందమైన రైల్వే స్టేషన్‌లు.. మీరూ ఓ లుక్కేయండి..!