రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాకు తీవ్ర అస్వస్ధత, జైలు నుంచి తరలింపు, ముంబై జేజే ఆసుపత్రిలో చేరిక,

రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫేక్ టీవీ రేటింగ్స్ కేసులో అరెస్టయి..

  • Umakanth Rao
  • Publish Date - 6:11 pm, Sat, 16 January 21
రేటింగ్స్ ఏజెన్సీ మాజీ  సీఈఓ పార్థో దాస్ గుప్తాకు తీవ్ర అస్వస్ధత,  జైలు నుంచి తరలింపు, ముంబై జేజే ఆసుపత్రిలో చేరిక,

రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫేక్ టీవీ రేటింగ్స్ కేసులో అరెస్టయి, తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈయన శనివారం ఉదయం హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గిపోవడంతో ఈయనను జైలు నుంచి హుటాహుటిన ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. ఫేక్ టీఆర్ఫీ రిగ్గింగ్ స్కామ్ లో పార్థో దాస్ గుప్తాను పోలీసులు గత ఏడాది డిసెంబరు 24 న అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో ఈయన కీలక పాత్ర వహించారని భావించిన ముంబై కోర్టు ఈయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. కాగా తన ఛానెల్ రేటింగ్స్ పెరగడానికి రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి ఈయనకు లక్షలాది రూపాయల ముడుపులు అందజేశారని ముంబై పోలీసులు లోగడ పేర్కొన్నారు. అటు- పార్థో దాస్ గుప్తా అనారోగ్యానికి సంబంధించి డాక్టర్లు క్లారిఫై చేయాల్సి ఉంది.

Also Read:

Sonu Sood Tailor Shop: టైలరింగ్ షాప్ ఓపెన్ చేసిన సోనూ సూద్.. బట్టలు కుట్టడంలో గ్యారెంటీ లేదు

Ap Corona Cases: ఏపీలో కొత్తగా 114 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

Worms found in liquor bottle: లిక్కర్‌ బాటిల్‌లో పురుగులు.. తనిఖీలు నిర్వహించిన అధికారులు ఏం చెప్పారంటే..?