‘ఈఎస్ఐ స్కామ్ వాల్యూమ్2’ ఈ సాయంత్రం రిలీజ్

తెలంగాణలో సంచలనం రేపిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణం కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్స్ కు సంబంధించి మందుల కొనుగోలు వ్యవహారంలో రెండో అంకం ప్రారంభమైంది.

'ఈఎస్ఐ స్కామ్ వాల్యూమ్2' ఈ సాయంత్రం రిలీజ్
Follow us

|

Updated on: Sep 04, 2020 | 1:38 PM

తెలంగాణలో సంచలనం రేపిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణం కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్స్ కు సంబంధించి మందుల కొనుగోలు వ్యవహారంలో రెండో అంకం ప్రారంభమైంది. ఈ కేసులో ఈ సాయంత్రం మీడియా ముందుకు కొత్త నిందితుల చిట్టా రాబోతోంది. ఈఎస్ఐ స్కామ్ లో మరో సారి మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా మరో 8 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ సాయంత్రం వీరితోపాటు కేసుకు సంబంధించిన పలు అంశాలను మీడియా ముందు పెట్టనున్నారు. కాగా, నిన్న ఈ స్కామ్ కు సంబంధించి కొత్తగా 6 .5 కోట్ల అక్రమాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ మందుల కొనుగులు లో ఈ భారీ అక్రమాలను గుర్తించారు. ఈ కుంభకోణం కు సంబంధించి మరో కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త కేసులో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ ల(Hemoque)హేమోవీ.. నకిలీ ఇండెక్స్ లు.. ఎక్కవగా కోడ్ చేసి తప్పుడు లెక్కలతో అక్రమాలు చేసినట్టు నిగ్గుతేలింది.