Enforcement Directorate: మాల్యా, మోదీ, చోక్సీలకు ఈడీ షాక్.. సీజ్ చేసిన ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో సీజ్ చేసిన వేల కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు బదిలీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.

Enforcement Directorate: మాల్యా, మోదీ, చోక్సీలకు ఈడీ షాక్.. సీజ్ చేసిన ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు
Vijay Malya, Neerav Modi, Mehul Choksi Images
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 23, 2021 | 3:24 PM

Enforcement Directorate shocks Mallya, Modi, Choksi: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో సీజ్ చేసిన వేల కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు బదిలీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఈ ముగ్గురి నుంచి సీజ్ చేసిన 8 వేల 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ వారు ముంచిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బదిలీ చేయగా.. ఇప్పటి వరకు మొత్తం 9 వేల 371 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బ్యాంకులకు అందజేసినట్లయింది. ఈ మేరకు ఈడీ ఓ ట్వీట్ ద్వారా వివరాలను వెల్లడించింది.

బోగస్ పత్రాలతో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు మొత్తం 22 వేల 586 కోట్ల మేరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ముంచేశారు. ఈ కేసులపై దర్యాప్తు చేసిన ఈడీ.. వారి నుంచి 18 వేల 170 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా 8 వేల 441 కోట్ల మేరకు ఆస్తులను బ్యాంకులకు అప్పగించగా.. ఇప్పటి వరకు మొత్తం 9 వేల 371 కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకుల పరిధిలోకి చేరాయి. ఇంతకు ముందే ఈడీ 330 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇదివరకే ఈడీ జప్తు చేసింది. కాగా ఈ ముగ్గురు కలిసి బ్యాంకులను మోసం చేసిన మొత్తం 22 వేల 586 కోట్ల రూపాయలలో 40 శాతాన్ని ఇప్పటి వరకు రికవరీ చేసినట్లయ్యింది.

ఇదిలా వుండగా.. పలు బ్యాంకులను ముంచేసిన కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా కొన్నేళ్ళుగా యుకేలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మన దేశంలో బ్యాంకులను నిండా ముంచిన మాల్యా ఆ సొమ్ముతో యుకేలో విల్లాలను, ఫామ్ హౌజ్‌లను కొనుగోలు చేసి.. లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సైతం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బోగస్ పత్రాలను చూపించి.. భారీ ఎత్తున రుణాలు తీసుకుని.. బిచాణా ఎత్తేశాడు. నీరవ్ సైతం యుకేలోనే తలదాచుకున్నాడు. అతన్ని ఇండియాకు అప్పగించే విషయం ప్రస్తుతం యుకే కోర్టులో విచారణలో వుంది. ఇక నీరవ్ మోదీ మేనమామ.. ఈ మోసపు బాగోతంలో భాగస్వామి అయిన మెహుల్ చోక్సీ.. కరీబియన్ దీవుల్లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం అతను డొమినికాలో వుండగా.. అతన్ని ఇండియాకు అప్పగించే విషయం కూడా విచారణలో వుంది.

Also Read: అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. స్టీల్ ప్లేట్లు, ఇనుప వస్తువులు ఇట్టే అతుక్కుపోతున్నాయ్

సచిన్, యువరాజ్ సింగ్‌ల కొత్త ఆట..! వీరికి మరో పార్ట్‌నర్ జత కలిసాడు.. ఇంతకి ఏం చేశారో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణా నదీ జలవివాదం.. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..