Chinese Loan App: చైనా లోన్ యాప్‌పై ED దాడులు… రూ. 107 కోట్లు స్వాధీనం.. అసలు విషయం ఎంటో తెలుసా..

చైనా నియంత్రణలో నడుస్తున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. పెద్ద మొత్తంలో నిధులను సీజ్ చేసింది. వారి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో సంచనల నిజాలు వెలుగు చూశాయి.

Chinese Loan App: చైనా లోన్ యాప్‌పై ED దాడులు... రూ. 107 కోట్లు స్వాధీనం.. అసలు విషయం ఎంటో తెలుసా..
Ed Seizes Funds
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 27, 2021 | 2:28 PM

చైనా నియంత్రణలో నడుస్తున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. పెద్ద మొత్తంలో నిధులను సీజ్ చేసింది. వారి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై చైనా నియంత్రణలో ఉన్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) దాదాపు 107 కోట్ల రూపాయల నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. చైనాకు చెందిన యాప్ తక్షణ వ్యక్తిగత రుణాలు ఇస్తోందని.. దీనిలో విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘించినట్లుగా ED తెలిపింది. రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనాన్స్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.106.93 కోట్లు ఈడీ జప్తు చేసింది. క్యాష్ బీన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా రుణాలు ఇచ్చిన పీసీఎఫ్‌ఎస్‌.. చైనాకు చెందిన జో యాహుయ్‌ ఆధీనంలో పనిచేస్తోందని ఈడీ అధికారులు వెల్లడించారు. బోగస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, యూఎస్‌, సింగపూర్‌కు నిధులు తరలించినట్టు ఈడీ వెల్లడించింది.

NBFC కంపెనీ PC ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏజెన్సీ తెలిపింది. (PC Financial Services Private Limited- PCFS) నిధులు బ్యాంకు ఖాతాలలో ఉన్నాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 106.93 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ED కేసు

అనేక NBFCలు, ఫిన్‌టెక్ కంపెనీలపై కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు సమయంలో ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ED తెలిపింది. ఈ కేసు తక్షణ రుణం అందించే మొబైల్ అప్లికేషన్‌కు సంబంధించినది. యాప్ ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నట్లు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా ఉపయోగించడం ద్వారా రుణాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. కాల్ సెంటర్ నుండి వినియోగదారులకు బెదిరింపులు. దాడులు చేయడం వంటి క్రిమినల్ చర్యలకు దిగినట్లు ఆరోపనలు వచ్చాయి.

క్యాష్‌బీన్ అనే యాప్ ద్వారా రుణం..

ఏజెన్సీ ప్రకారం గత ఏడాది అనేక రాష్ట్రాల నుండి ఇటువంటి యాప్‌ల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా COVID-19 వ్యాప్తి సమయంలో ఆర్థిక ఒత్తిడిలో ఉన్నవారిని వీరు టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ‘అనుమానాస్పద’ కంపెనీల దోపిడీ, వేధింపుల కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని అధికారులు అనుమానిస్తున్నారు.  ‘క్యాష్‌బీన్’ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇలాంటి రుణాలు ఇస్తున్నట్లు ED గుర్తించింది.

RBI మార్గదర్శకాలకు వ్యతిరేకంగా

చైనీస్ మొబైల్ యాప్ కంపెనీ రుణాలు ఇస్తున్న చట్టవిరుద్ధ రుణాలు, NBFC ల భవిష్యత్తు, బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థకు కూడా ఇది మంచి సంకేతం కానుంది. వారు కస్టమర్లకు 32 నుండి 40 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇది RBI మార్గదర్శకాలకు విరుద్ధం అని అధికారులు తెలిపారు. రుణ ఆమోదం సమయంలో కంపెనీ 2 నుండి 3 నెలల కాలపరిమితిని ఇస్తుంది. కానీ 1 నుండి 2 వారాల తర్వాత రికవరీ ఏజెంట్లు కాల్ చేయడం .. బెదిరించడం మొదలు పెడుతారు.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు