ED Raids: లోన్‌ యాప్స్‌ ఆగడాలకు చెక్‌పెట్టేలా ఈడీ దూకుడు.. 18 ప్రాంతాల్లో సోదాలు.. రూ.17 కోట్ల క్యాష్‌ సీజ్‌

ED Raids: దేశ వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) కొరడా ఝులిపిస్తోంది. చైనా లోన్‌యాప్‌ అక్రమాలపై ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. దేశంలో

ED Raids: లోన్‌ యాప్స్‌ ఆగడాలకు చెక్‌పెట్టేలా ఈడీ దూకుడు.. 18 ప్రాంతాల్లో సోదాలు.. రూ.17 కోట్ల క్యాష్‌ సీజ్‌
Ed
Follow us

|

Updated on: Sep 03, 2022 | 5:51 PM

ED Raids: దేశ వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) కొరడా ఝులిపిస్తోంది. చైనా లోన్‌యాప్‌ అక్రమాలపై ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. దేశంలో 18 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పేమెంట్‌ గేట్‌వేస్‌ రోజర్‌పే, పేటీఎం పేమెంట్స్‌, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌ కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సోదాలు నిర్వహిస్తోంది. లోన్‌ యాప్స్‌ ఆగడాలకు చెక్‌పెట్టేలా ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. డబ్బుల బదిలీకి నకిలీ బ్యాంక అకౌంట్స్‌ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. భారీగా సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు రూ.17 కోట్ల క్యాష్‌ను సీజ్‌ చేసింది.

పేమెంట్‌ గేట్‌వేల ద్వారా విదేశాలకు డబ్బులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులో 9 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లోన్ యాప్స్‌ ద్వారా రుణం కంటే 6 రెట్లు అధికంగా వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. చైనీస్‌ లోన్‌యాప్‌ అక్రమాలపై మనీలాండరింగ్‌ కేసులు నమోదు అయ్యాయి.

కాగా, దేశంలో చైనీస్‌ లోన్‌ యాప్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. నిమిషాల్లోనే లోన్‌ మంజూరు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ లోన్‌ యాప్స్‌ ద్వారా ఎంతో మంది బలయ్యారు. లోన్‌ తీసుకోవడమే తరువాయి వేధింపులు ప్రారంభం అవుతాయి. లోన్‌ డబ్బులు ఒక రోజు ఆలస్యం అయితే చాలు.. తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ అక్రమ లోన్‌ యాప్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకోవద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అడగ్గానే లోన్‌ వస్తుంది కాదా అని రుణం తీసుకోవద్దని, తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి