అదిగో దీపిక ! ఇదిగో సారా ! మీడియా అత్యుత్సాహం, ముంబై ఖాకీల ఫైర్

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీల వెంట బడుతున్న రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు తమ వాహనాలతో చేస్తున్న హంగామాతో పెద్ద జాతరను తలపిస్తోంది ముంబై ! ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో..

అదిగో దీపిక ! ఇదిగో సారా ! మీడియా అత్యుత్సాహం, ముంబై ఖాకీల ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 4:14 PM

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీల వెంట బడుతున్న రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు తమ వాహనాలతో చేస్తున్న హంగామాతో పెద్ద జాతరను తలపిస్తోంది ముంబై ! ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీస్ ముందయితే ఇసుకవేస్తే జనం రాలని పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజూ వీరి తాకిడి ఎక్కువైపోతుండడంతో ముంబై పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. మీరు ఈ సెలబ్రిటీలను  రిస్క్ లో పెడుతున్నారు, మీరూ రిస్క్ లో పడుతున్నారు.. ఇలా అయితే మీ వాహనాలను సీజ్ చేస్తాం, డ్రైవర్లను అరెస్టు చేస్తాం అని ఆదివారం వార్నింగ్ ఇచ్చారు మీడియా, ఛానెల్ వాళ్లకు !

మరీ నిన్న దీపికా పదుకోన్, సారా అలీఖాన్, శ్రధ్ధాకపూర్ తమ ఇళ్లనుంచి బయలుదేరగానే వారి వాహనాల వెంట మీడియాల వెహికిల్స్ కూడా పరుగులు తీశాయి. ఇక ఎన్సీబీ ఆఫీసు ముందు మరో ‘ట్రాఫిక్ జామ్’! ఈ తారలు తమ కార్లు దిగగానే పొలోమంటూ మైకులు, లోగోలు పట్టుకుని రిపోర్టర్లు, వారి వెంటే కెమెరామెన్లు బిలబిలమంటూ చేరారు. అసలు వారు తమ వాహనాలు దిగకముందే చుట్టుముట్టి తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం పరిపాటయింది. అలాగే తమ ఇంటరాగేషన్ ముగించుకుని ఈ సెలబ్రిటీలు బయటకు వస్తున్నప్పుడు కూడా అదే సీన్ ! వీళ్ళ బారి నుంచి తప్పించుకోవడం బాలీవుడోళ్లకు చాలా కష్టమైపోతోంది. అందుకే ..మీరిలా ఛేజ్ చేసి వీరిని ట్రబుల్స్ లో పడేస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, మీ వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు మరీమరీ హెచ్చరిస్తున్నారు.