కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో ఉగ్రవాదులు హతం..

దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు బార్డర్‌లో సైన్యం అటు కరోనాతో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తున్నారు. తాజాగా షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు, భధ్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ ఘటనలో మంగళవారం రాత్రి ఒక ఉగ్రవాది మరణించగా.. బుధవారం తెల్లవారు జామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:42 pm, Wed, 29 April 20
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో ఉగ్రవాదులు హతం..

దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు బార్డర్‌లో సైన్యం అటు కరోనాతో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తున్నారు. తాజాగా షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు, భధ్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ ఘటనలో మంగళవారం రాత్రి ఒక ఉగ్రవాది మరణించగా.. బుధవారం తెల్లవారు జామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నారు. కాగా.. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు దాదాపు ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.