బ్రేకింగ్‌.. దద్దరిల్లిన దండకారణ్యం.. ఐఈడీ పేల్చిన నక్సల్స్‌‌..

గురువారం నాడు దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కన్కేర్ జిల్లాలో నక్సలైట్లుకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 3:52 pm, Thu, 18 June 20
బ్రేకింగ్‌.. దద్దరిల్లిన దండకారణ్యం.. ఐఈడీ పేల్చిన నక్సల్స్‌‌..

గురువారం నాడు దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కన్కేర్ జిల్లాలో నక్సలైట్లుకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. జిల్లాలోని ప్రతాప్ పూర్ అటవీ ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మహ్లా ప్రాంతంలో నక్సలైట్లు ఐఈడీ బ్లాస్ట్ చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. అయితే ఆ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లంతా తప్పించుకున్నారు. ఈ విషయాన్ని బస్తర్‌ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి నుంచి నక్సలైట్లు అటవీ ప్రాంతంలోకి తప్పించుకున్నారని.. వారి కోసం కూంబింగ్ చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.