Huge Electricity Bill: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు.. కంగుతిన్న దుకాణదారుడు!

రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకున్న ఓ దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తికి క‌రెంట్ బిల్లు రూపంలో షాక్ ఇచ్చింది విద్యుత్ శాఖ. అక్షరాలా రూ. 55 లక్షల కరెంటు బిల్లు వేసింది.

Huge Electricity Bill: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు.. కంగుతిన్న దుకాణదారుడు!
Huge Electricity Bill

రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకున్న ఓ దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తికి క‌రెంట్ బిల్లు రూపంలో షాక్ ఇచ్చింది విద్యుత్ శాఖ. అక్షరాలా రూ. 55 లక్షల కరెంటు బిల్లు వేసింది. ఈ సంఘటన హిమాచల్​ ప్రదేశ్​ ఉనా జిల్లాలో జరిగింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కార‌ణంగానే అంత బిల్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇది చూసిన స్థానికులు విద్యుత్తు అధికారుల తీరుపై విమర్శలు చేశారు.

అస‌లేం జరిగిందంటే…

హిమాచల్​ ప్రదేశ్​ ఉనా జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ ​కుమార్​ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకుగానూ అతనికి రూ. 6,702 బిల్లు వేసింది విద్యుత్​ శాఖ. దానిని అతను ఆర్థిక ఇబ్బందులు కార‌ణంగా చెల్లించలేదు. దీంతో అధికారులు అతని దుకాణానికి క‌రెంట్​ సరఫరాను నిలిపివేశారు. చేసేది ఏం లేక బకాయిలను ఆన్​లైన్​లో చెల్లించాలని పోర్టల్​లో చూశాడు. అంతే అక్కడ ఉన్న బిల్లును చూసి అత‌డి మైండ్ బ్లాంక్ అయ్యింది. అందులో రూ. 6 వేలకు బదులుగా.. రూ. 55 లక్షల 14వేల 945 కనిపించింది. ఒక్కసారిగా నివ్వెరపోయిన అతను విద్యుత్​ బోర్డ్​ను ఆశ్రయించాడు. విద్యుత్ శాఖ అధికారులు త‌ప్పు దిద్దుకునే ప‌నిలో ఉన్నారు. కాగా గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా సార్లు వెలుగుచూశాయి. ముందుగా అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డం విద్యుత్ శాఖ సిబ్బందికి అల‌వాటుగా మారింది. అస‌లే భారీ విద్యుత్ బిల్లుల‌తో విసిగి వేసారిపోతున్న జ‌నాల‌కు.. సిబ్బంది కొత్త టెన్ష‌న్లు తెచ్చిపెడుతున్నారు.

Also Read: ‘మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతాను..’ షాకింగ్ విష‌యం రివీల్ చేసిన త‌మ‌న్నా

 పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు