హాంకాంగ్.వెళ్తున్న నౌకనుంచి 18 మంది భారతీయుల కిడ్నాప్

హాంకాంగ్.వెళ్తున్న నౌకనుంచి 18 మంది భారతీయుల కిడ్నాప్

హాంకాంగ్ వెళ్తున్న నౌకలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయులను నైజీరియా సముద్ర తీర ప్రాంతంలో సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలిసినవెంటనే నైజీరియాలోని భారత దౌత్యాధికారులు అక్కడి అధికారులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేయాలని, కిడ్నాపైన భారతీయులను రక్షించాలని వారు కోరారు. నౌకల ట్రాకింగ్ ని పర్యవేక్షించే ఎఆర్ఎక్స్ మారిటైం తన వెబ్ సైట్ లో.. ఈ నెల 3 వ తేదీ సాయంత్రం ఈ నౌకను సముద్రపు దొంగలు దారి […]

Anil kumar poka

|

Dec 05, 2019 | 11:20 AM

హాంకాంగ్ వెళ్తున్న నౌకలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయులను నైజీరియా సముద్ర తీర ప్రాంతంలో సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలిసినవెంటనే నైజీరియాలోని భారత దౌత్యాధికారులు అక్కడి అధికారులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేయాలని, కిడ్నాపైన భారతీయులను రక్షించాలని వారు కోరారు. నౌకల ట్రాకింగ్ ని పర్యవేక్షించే ఎఆర్ఎక్స్ మారిటైం తన వెబ్ సైట్ లో.. ఈ నెల 3 వ తేదీ సాయంత్రం ఈ నౌకను సముద్రపు దొంగలు దారి మళ్లించారని, ఇందులో 19 మంది ఉండగా 18 మంది భారతీయులని పేర్కొంది. ఉన్న ఒక వ్యక్తీ టర్కీకి చెందిన వాడని తెలిసింది. వీ ఎల్ ఎల్ సీ సీ.. కాన్స్టిలేషన్ అనే ఈ నౌకపై పైరేట్స్ దాడి చేసినప్పటికీ దానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఈ షిప్ నైజీరియన్ నేవీ అజమాయిషీలో ఉందని వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలే నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ కు ఈ భారతీయులు ఎందుకు వెళ్తున్నారన్నది మిస్టరీగా మారింది. చైనా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా హాంకాంగ్ లో దాదాపు ఆరు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu