Edible Oil: హైవేపై బోల్తా పడ్డ వంటనూనె ట్యాంకర్.. జనం ఎలా ఎగబడి నూనె తీసుకెళ్తున్నారో మీరే చూడండి..

Edible Oil: ఒక పక్క వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ప్రజలు ఎక్కువ రేటు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో..

Edible Oil: హైవేపై బోల్తా పడ్డ వంటనూనె ట్యాంకర్.. జనం ఎలా ఎగబడి నూనె తీసుకెళ్తున్నారో మీరే చూడండి..
Cooking Oil
Follow us

|

Updated on: May 22, 2022 | 5:49 PM

Edible Oil: ఒక పక్క వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ప్రజలు ఎక్కువ రేటు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో రద్దీగా ఉండే ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. సదరు ట్యాంకర్ సుమారు 12 వేల లీటర్ల వంట నూనెను తరలిస్తోంది. పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ట్యాంక్ నుంచి లీకౌతున్న వంటనూనెను సమీప గ్రామ ప్రజలు బిందెలు, క్యాన్లతో తీసుకెళ్లారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం స్థానిక రెస్క్యూ టీం ద్వారా ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి తొలగించి సాధారణ ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్లు అధికారి తెలిపారు. ఇందుకోసం సుమారు మూడు గంటల పాటు అధికారులు శ్రమించాల్సి వచ్చింది.

గుజరాత్ లోని సూరత్ నుంచి ముంబైకి వంటనూనెను తరలిస్తున్న ట్యాంకర్.. దారిలో ఒక వాహనాన్ని తప్పిచబోయి హైవేపై ప్రమాదానికి గురైంది. శనివారం ప్రమాదం జరగడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్‌పై నుంచి పడుతున్న ఆయిల్‌ను దోచుకెళ్లారని తెలిపారు. 12,000 లీటర్ల ఎడిబుల్ ఆయిల్‌ను ప్రాసెసింగ్ కోసం తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది. రద్దీని నియంత్రించడంతోపాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?