Drugs Seized: ముంబై పోర్టులో భారీగా హెరాయిన్‌ పట్టివేత.. దీని విలువ తెలిస్తే షాకే.. ఈ ఏడాదిలో అతిపెద్ద అక్రమ రవాణా ఇదే

Drugs Seized: ముంబై పోర్టులో 1,725 ​​కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు.. ఈ ఏడాది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సీజ్‌లో ఇదే అతిపెద్దదంటున్నారు.

Drugs Seized: ముంబై పోర్టులో భారీగా హెరాయిన్‌ పట్టివేత.. దీని విలువ తెలిస్తే షాకే.. ఈ ఏడాదిలో అతిపెద్ద అక్రమ రవాణా ఇదే
Drugs Seized
Follow us

|

Updated on: Sep 22, 2022 | 5:00 AM

Drugs Seized: ముంబై పోర్టులో 1,725 ​​కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు.. ఈ ఏడాది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సీజ్‌లో ఇదే అతిపెద్దదంటున్నారు. ఎంత పెద్ద నిఘా ఉన్నా వివిధ మార్గాల్లో బయటి నుంచి దేశంలోని మాదకద్రవ్యాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ముంబైలోని నవషెవా పోర్టులో భారీ ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల కంటైనర్‌తో దీన్ని అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. మొత్తం 350 కిలోల హెరాయిన్‌ ఇందులో దాచి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 1,725 కోట్ల మేర ఉంటుందని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌జిఎస్ ధాలివాల్ మీడియాకు తెలిపారు.

పక్కా సమాచారంలో నిఘా పెట్టి ఈ మాదక ద్రవ్యాలను పట్టుకున్నామన్నారు. అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్స్‌ మన దేశంలోని సరుకును పంపడానికి అనేక మార్గాలను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు ధాలివాల్. ఈ ఏడాది పట్టబడిన అతిపెద్ద అక్రమ డ్రగ్స్‌ రవాణా ఇదే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయంలో లోతుగా దర్యాప్తు సాగిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌ తీరంలో ఇదే తరహాలో భారీగా డ్రగ్స్‌ దొరికాయి. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ దాదాపు 200కోట్ల రూపాయల విలువైన 40 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇవి పాకిస్తాన్‌ నుంచి మన దేశంలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సరిగ్గా ఏడాది క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో రూ. 21,000 కోట్ల విలువైన 3,000 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి