శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్.. స్పెషాలిటీ ఇదే

DRDO test fired Shourya missile successfully: ఒకవైపు భారత్, చైనా సరిహద్దులో టెన్షన్ పరిస్థితి కొనసాగుతున్న దరిమిలా భారత రక్షణ రంగంలో ప్రయోగాలు జోరందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ శనివారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం వున్న శౌర్య మిస్సైల్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం జరిపిన శౌర్య క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలోని […]

శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్.. స్పెషాలిటీ ఇదే
Follow us

|

Updated on: Oct 03, 2020 | 2:19 PM

DRDO test fired Shourya missile successfully: ఒకవైపు భారత్, చైనా సరిహద్దులో టెన్షన్ పరిస్థితి కొనసాగుతున్న దరిమిలా భారత రక్షణ రంగంలో ప్రయోగాలు జోరందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ శనివారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం వున్న శౌర్య మిస్సైల్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది.

ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం జరిపిన శౌర్య క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. శౌర్య క్షిపణిని గతంలోనే రూపొందించింది డీఆర్డీఓ. తాజాగా దానిని మరింత ఆధునీకరించి.. కొత్త వెర్షన్‌ను ప్రయోగించి చూసుకున్నారు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు. ఆధునీకరించిన ఈ శౌర్య మిసైల్‌ని త్వరలోనే భారత అమ్ముల పొదిలోకి చేరుస్తామని ప్రకటించారు.

అత్యంత తేలికైన క్షిపణిగా పేరున్న శౌర్యను ప్రయోగించడం కూడా తేలిక అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యూహాత్మక క్షిపణుల తయారీలో పూర్తి స్వయం స్వావలంబన సాధించే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్న డీఆర్డీఓ శాస్త్రవేత్తలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర భారత్ స్పూర్తితో ప్రయోగాలను ముమ్మరం చేశారు.

Also read: బోరబండకు అక్టోబర్ భయం.. అప్పట్లో ఏం జరిగిందంటే?