జీ-7 సమ్మిట్ కి ఇండియాను ఆహ్వానిస్తారా ? ట్రంప్ పై చైనా ఫైర్

జీ-7 సమ్మిట్ కి ఇండియా, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదన పట్ల చైనా భగ్గుమంది. తమ దేశానికి...

జీ-7 సమ్మిట్ కి ఇండియాను ఆహ్వానిస్తారా ? ట్రంప్ పై చైనా ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 1:17 PM

జీ-7 సమ్మిట్ కి ఇండియా, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదన పట్ల చైనా భగ్గుమంది. తమ దేశానికి వ్యతిరేకంగా ఏ చిన్న గీత గీసినా అది విఫలమవుతుందని, పాపులర్ కాబోదని మండిపడింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో కూడిన ఈ కూటమిలో ఇండియా, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా దేశాలను కూడా చేర్చాలని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. జూన్ మాసాంతంలో గానీ…. జులై నెలలో గానీ జరగవలసి ఉన్న జీ-7 శిఖరాగ్ర సమావేశాన్ని ఆయన సెప్టెంబరుకు వాయిదా వేశారు. కాలం చెల్లిన ఈ కూటమిని జీ-7 అని వ్యవహరించే బదులు ఇందులో ..  మరో మూడు దేశాలను కూడా చేరిస్తే.. అది జీ-10 లేదా, జీ-11 అవుతుందని ఆయన చెప్పారు. అయితే ఆయన యోచనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానిస్తూ.. అన్ని అంతర్జాతీయ సంస్థలు, కాన్ఫరెన్సులు ఆయా దేశాల మధ్య పరస్పర విశ్వాసం, అంగీకారంతోనే జరగాలని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఈ విధమైన పాత్రనే పోషించాలని, మా దేశానికి వ్యతిరేకంగా చిన్న సర్కిల్ గీసినా అది ఫెయిల్ అవుతుందని, పాపులర్ కాబోదని పేర్కొన్నారు. హాంకాంగ్ పై పెత్తనం విషయంలో.. చైనా దేశాన్ని ఏకాకిని చేసేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు.