PM Modi: ప్రధాని మోదీ పక్కన లేడీ కమాండో ఎవరంటే.? అసలు మ్యాటర్ ఇది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ప్రధాని భద్రత చూసే ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ వైరల్ చేశారు. దీనికి తోడు బీజేపీ ఎంపీ..

PM Modi: ప్రధాని మోదీ పక్కన లేడీ కమాండో ఎవరంటే.? అసలు మ్యాటర్ ఇది
Trending
Follow us
Ranjith Muppidi

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2024 | 12:10 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ప్రధాని భద్రత చూసే ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ వైరల్ చేశారు. దీనికి తోడు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీంలో ఉంటారని ఈ మహిళా SPG కమాండో కాదన్నారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్సనల్ సెక్యూరిటీ అని CRPF అసిస్టెంట్ కమాండెంట్ అని తెలిపారు. భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు SPG 1985లో స్థాపించబడింది. SPG అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థగా మారింది. భద్రతా కార్యకలాపాల్లో నూతన పద్ధతులను అనుసరించడం దాని ప్రత్యేకత.

ఎస్పీజీలో మహిళా కమాండో బాధ్యతలు చేపడతారు. సందర్శకులను తనిఖీ చేయడం, ఎంట్రీ, ఎక్సిట్ పాయింట్లను పర్యవేక్షించడం, ప్రమాద నివారణలు నిర్వహించడం వీరి బాధ్యతల్లో భాగం. 2015 నుంచి మహిళలు SPG క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్(CPT)లో భాగంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం SPGలో సుమారు 100 మహిళా కమాండోలు ఉన్నాయి. వీరు మహిళా సందర్శకుల తనిఖీ, భద్రతా సంబంధాల బాధ్యతలు నిర్వహిస్తారు. భద్రతా పద్ధతులను అనుసరించి, మారుతున్న ప్రమాదాలకు అనుగుణంగా SPG మహిళ కమండోలు శిక్షణ పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..