మోదీని పొగిడాడు.. సస్పెన్షన్‌కు గురయ్యాడు..!

ప్రధాని నరేంద్ర మోదీని పొగిడి సస్పెన్షన్‌కు గురయ్యాడు ఓ ఎమ్మెల్యే. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూకా సెల్వం ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ప్రధాని..

మోదీని పొగిడాడు.. సస్పెన్షన్‌కు గురయ్యాడు..!

ప్రధాని నరేంద్ర మోదీని పొగిడి సస్పెన్షన్‌కు గురయ్యాడు ఓ ఎమ్మెల్యే. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూకా సెల్వం ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని పలు అంశాలను ప్రస్తావిస్తూ పొగిడారు. ఇక అంతేకాకుండా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు. దీంతో పార్టీ నిబంధనలను ఉల్లంఘించారంటూ.. డీఎంకే సదరు ఎమ్మెల్యేపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆయన్ను ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో కారణాలు చెప్పాలని.. పార్టీ అతడికి షోకాజులు కూడా పంపింది. అయితే సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే కూకా సెల్వం.. వెంటనే తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. దీంతో డీఎంకే పార్టీ నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Click on your DTH Provider to Add TV9 Telugu