RGV: చట్టాలు నేరాలను నియంత్రించలేవు, అది దెయ్యాల వల్లే సాధ్యం.. ఢిల్లీ హత్యపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యువతి హత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనతో సహజీవనం చేస్తున్న ప్రేయసిని అత్యంత క్రూరంగా చంపిన ప్రియుడి సంఘటనకు దేశం ఉలిక్కిపడింది. శవాన్ని మాయం చేయడానికి మృతదేహాన్ని ఏకంగా 35 ముక్కలు చేసి..

RGV: చట్టాలు నేరాలను నియంత్రించలేవు, అది దెయ్యాల వల్లే సాధ్యం.. ఢిల్లీ హత్యపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.
Ram Gopal Varma
Follow us

|

Updated on: Nov 16, 2022 | 7:01 PM

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యువతి హత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనతో సహజీవనం చేస్తున్న ప్రేయసిని ప్రియుడు అత్యంత క్రూరంగా చంపాడన్న వార్త దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శవాన్ని మాయం చేయడానికి మృతదేహాన్ని ఏకంగా 35 ముక్కలు చేసి అటవీ ప్రాంతాల్లో పారేశాడు. 26 ఏళ్ల శ్రద్ధను అఫ్తాబ్‌ అమీన్‌ అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. విచారణలో భాగంగా తేలుతోన్న అంశాలు భయందోళనకు గురి చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే సమజాంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఢిల్లీ హత్య కేసు గురించి స్పందించారు. ఈ విషయమై ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. చనిపోయిన యువతి దెయ్యమై తిరిగొచ్చి హత్య చేసినవాడిని డెబ్బై ముక్కలుగా నరకాలి అని రాసుకొచ్చిన వర్మ.. ఇలా ప్రియుడి చేతిలో హత్యకు గురయిన యువతులంతా ఇదేమాదిరిగా దెయ్యాలుగా మారి కిల్లర్స్‌ని చంపాలన్నాడు. అంతటితో ఆగని వర్మ.. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టాలు ఇలాంటి దారుణమైన నేరాలను నియంత్రించలేవని, అది కేవలం దెయ్యాల వల్లే సాధ్యమవుతుందని వర్మ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హత్యలు, దోపిడీలను తన సినిమా కథలకు ఇతివృత్తంగా చేసుకునే రామ్‌గోపాల్‌ వర్మ ఢిల్లీ హత్య వ్యవహారాన్ని కూడా సినిమాలా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాస్తంగా జరిగిన కొన్ని హత్యల ఇతివృత్తంగా సినిమాలు తీసిన వర్మ త్వరలోనే ఢిల్లీ యువతి హత్యను కూడా వెండి తెరపై చూపించనున్నారని సమాచారం. మరి ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే వర్మ ఏం చేస్తాడో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..