చైనాతో బోర్డర్ వివాదం.. 2001 లోనే ఇండియా తప్పిదం చేసిందా ?

ఇండియాతో... .. ముఖ్యంగా టిబెట్  లో గల తమ బోర్డర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 2001 లోనే చైనా యత్నించిందని, అయితే అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం ఇందుకు స్పందించలేదని తెలియవచ్చింది. లండన్ లో భారత సంతతికి చెందిన ఓప్రముఖ లాయర్  సరోష్ జైవాలా తాను..

  • Umakanth Rao
  • Publish Date - 5:45 pm, Thu, 18 June 20
చైనాతో బోర్డర్ వివాదం.. 2001 లోనే ఇండియా తప్పిదం చేసిందా ?

ఇండియాతో… .. ముఖ్యంగా టిబెట్  లో గల తమ బోర్డర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 2001 లోనే చైనా యత్నించిందని, అయితే అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం ఇందుకు స్పందించలేదని తెలియవచ్చింది. లండన్ లో భారత సంతతికి చెందిన ఓప్రముఖ లాయర్  సరోష్ జైవాలా తాను ఇటీవల రచించిన పుస్తకంలో ఈ విషయాన్ని తెలిపారు.  ఈ వివాద పరిష్కారానికి   భారత, చైనా దేశాల నాయకుల మధ్య రహస్య సమావేశాలు జరగాలని బ్రిటన్ కు అప్పటి చైనా రాయబారి అయిన మా జెన్ గాంగ్ తనకు సూచించారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు వివాద పరిష్కారానికి రెండు దేశాలూ ఉన్నత స్థాయిలో ఆచరణాత్మక విధానాలను అన్వేషించాలని ఆయన అభిప్రాయపడ్డారన్నారు.

నాడు హాంకాంగ్ అప్పగింత విషయంలో బ్రిటన్, చైనా మధ్య తలెత్తిన వివాదాన్ని తాను పరిష్కరించగలిగానని సరోష్ జైవాలా తెలిపారు.’ చైనా ప్రతిపాదన గురించి నేను ఓ నోట్ ని రూపొందించి నాడు మేనకా గాంధీకి అందజేశాను.. దాన్ని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ కి పంపినట్టు ఆమె చెప్పారు. అయితే నేను లండన్ లోని వాషింగ్టన్ హోటల్ లో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా జస్వంత్ ని కలిసి ఈ నోట్ గురించి అడిగినప్పుడు దాన్ని తమ శాఖకు పంపానని ఆయన తెలిపారు.. కానీ దాని విషయంలో ఏమీ జరగలేదు’ అని అయన వివరించారు. అసలు ఆ రోజుల్లో  చైనాకు తన ఎకానమీపైనే దృష్టి ఉండేది తప్ప సైనికపరమైన ఆలోచనలేవీ ఉండేవి కావని ఆయన వెల్లడించారు.