కరోనా ఎఫెక్ట్‌.. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతేకాదు.. మన దేశంలో అయితే పూర్వీకులు నేర్పిన ఆచారాల వైపు నడుపుతోంది. పూర్వం ఇంటిలో అడుగు పెట్టేముందు..

కరోనా ఎఫెక్ట్‌.. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 6:10 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతేకాదు.. మన దేశంలో అయితే పూర్వీకులు నేర్పిన ఆచారాల వైపు నడుపుతోంది. పూర్వం ఇంటిలో అడుగు పెట్టేముందు కాళ్లు కడుక్కొని లోనికి వెళ్లాలని సూచించేవారు. అంతేకాదు మడి వంటి ఆచారాలతో పాటు.. ఇంట్లో ఎవరైనా పుట్టినా.. మరణించినా.. వేరు వేరు ఆచారాలు ఉండేవి. అవన్నీ సైన్స్‌ పరంగా వైరస్ వ్యాధుల బారిన పడకుండా ఉండేవన్న అభిప్రాయాలు వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతా రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అంతా ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. అటు ఆరోగ్య నిపుణులు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం పెంచడని సూచించడంతో.. ప్రజలు కూడా వాటిపై దృష్టిపెడుతున్నారు. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలను గమనిస్తే అర్ధమవుతోంది.

కర్ణాటకలోని శివమొగ్గ ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ మార్కెట్‌లో ఆర్గానిక్ వెజిటెబుల్స్‌, ఫ్రూట్స్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం దీనికి అద్దం పడుతోంది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటి నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్గానిక్ ఉత్పత్తులను కొంటున్నారంటూ రైతులు కూడా చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అంతా రోగనిరోధక శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నిస్తున్నారని.. ఈ క్రమంలో అంతా ఆర్గానిక్ ఉత్పత్తులను వాడుతున్నారని.. మార్కెట్‌లోని ఓ వ్యాపారి జాతీయ మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. శివమొగ్గలో ఉన్న వికాస్ ట్రస్ట్‌, సవయవ కృషి పరివార్‌ ఆధ్వర్యంలో ఈ మార్కెట్‌ నడుస్తుంది. వీరు ఎలాంటి రసాయన ఎరువులు కానీ.. పురుగుల మందులు కానీ వాడకుండా.. పంటలు పండించి మార్కెటింగ్‌ చేస్తుంటారు.