Crime News: బద్మాష్ కోడలు.. అత్తమామల నగ్న వీడియోలనే రికార్డు చేసింది.. ఎందుకిలా చేసిందో తెలిసి అంతా షాక్..

Obscene videos: ఓ కొడలు.. ప్రియుడితో కలిసి.. సొంత అత్తామామల మీదనే కుట్ర పన్నింది. వారి బెడ్‌రూంలో రహస్య కెమెరాలను అమర్చి అభ్యంతరకరమైన వీడియోలను రికార్డు చేసింది.

Crime News: బద్మాష్ కోడలు.. అత్తమామల నగ్న వీడియోలనే రికార్డు చేసింది.. ఎందుకిలా చేసిందో తెలిసి అంతా షాక్..
Crime News
Follow us

|

Updated on: Sep 20, 2022 | 8:27 AM

Obscene videos: ఓ కొడలు.. ప్రియుడితో కలిసి.. సొంత అత్తామామల మీదనే కుట్ర పన్నింది. వారి బెడ్‌రూంలో రహస్య కెమెరాలను అమర్చి అభ్యంతరకరమైన వీడియోలను రికార్డు చేసింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. ఓ కోడలు అత్తమామల బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలను అమర్చి అభ్యంతరకరమైన వీడియోలను రికార్డు చేసింది. చివరకు రూ.2 కోట్ల విలువైన నగలు, రూ.1.5 లక్షల నగదుతో పరారైంది. భర్త ఫిర్యాదు మేరకు లక్ష్మీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఆభరణాల వ్యాపారికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసముంటున్నారు. అయితే.. భార్య తన కాలేజీ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 5న భార్య మొబైల్‌లో స్నేహితుడి నుంచి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని భర్త చూశాడు. ఆ తర్వాత మొబైల్‌లో వచ్చిన ఇతర మెసేజ్‌లను కూడా చదవడంతో భార్య తన స్నేహితుడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. బాధితుడు భార్య స్నేహితుడికి ఫోన్ చేసి తనను కలవాలంటూ కోరాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. ఇంట్లో ఉన్న నగలు, నగదుతో పరారయింది.

దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం భర్తకు ఫోన్‌ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తమామల (భర్త తల్లిదండ్రులు) గదిలో రహస్య కెమెరాలు పెట్టి వారి నగ్న వీడియోలు తీశానని.. కేసును ఉపసంహరించుకోకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. అనంతరం పోలీసులు తనిఖీలు చేయగా.. బాధితుడి తల్లిదండ్రుల గదిలో కెమెరాలు, రికార్డర్లు అమర్చినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి