Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 16 వరకు మద్యం షాపులు బంద్‌..!

Liquor Shops: రాబోయే కొత్త మద్యం పాలసీల ప్రకారం.. వైన్స్‌ షాపులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం వచ్చేది ఎక్సైజ్‌ శాఖ నుంచి. మద్యం..

Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 16 వరకు మద్యం షాపులు బంద్‌..!
Representative Image
Follow us

|

Updated on: Sep 16, 2021 | 10:07 AM

Liquor Shops: రాబోయే కొత్త మద్యం పాలసీల ప్రకారం.. వైన్స్‌ షాపులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం వచ్చేది ఎక్సైజ్‌ శాఖ నుంచి. మద్యం షాపుల ద్వారా ఎంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇక ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకురానుంది ప్రభుత్వం. ఢిల్లీలో అక్టోబర్ 1వ తేదీ నవంబర్ 16 వరకు ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనుంది ఢిల్లీ సర్కార్‌. దీంతో 47 రోజుల పాటు ప్రభుత్వ మద్యం దుకాణాలలో మాత్రమే మద్యం విక్రయించబడుతుందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఢిల్లీని 32 జోన్లుగా విభజించడం ద్వారా లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీ కింద నవంబర్ 17 నుండి ఢిల్లీలో షాపులు తెరవబడతాయని, ఈ సమయంలో అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ అనంతరం నవంబర్‌ 17 నుంచి షాపులన్నీ తెరవనున్నట్లు పేర్కొన్నారు.

ఢిల్లీలో ప్రస్తుతం 720కి పైగా మద్యం షాపులు ఉన్నాయి. 260 ప్రైవేట్, 460 ప్రభుత్వ దుకాణాలు ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో ప్రైవేటు మద్యం షాపుల లైసెన్స్‌లను పొడిగించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 30 తర్వాత లైసెన్స్‌లను జారీ చేయదు. ఈ కారణంగా అక్టోబర్ 1 నుండి మొత్తం 260 మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ఆయన అన్నారు. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ కింద జారీ చేయబడిన లైసెన్సులు నవంబర్ 17 తెరవనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేటు మద్యం దుకాణాల మూసివేతతో 47 రోజుల పాటు ఢిల్లీలోని ప్రభుత్వ దుకాణాలలో మాత్రమే మద్యం విక్రయించబడుతుంది.

ఖజానాకు రూ.3000 కోట్ల ఆదనపు ఆదాయం:

క‌రోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవ‌స్ధకు మ‌ద్యంతో ఊపునిచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నూత‌న‌ ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెల‌ల్లో రూ 3000 కోట్ల అద‌న‌పు ఆదాయం ఆర్జిస్తుంద‌ని మ‌నీష్ సిసోడియా తెలిపారు. నగ‌రంలోని 32 జోన్లలో మ‌ద్యం దుకాణాల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ 10,000 కోట్ల రాబ‌డి స‌మ‌కూరుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తితో గ‌త ఏడాది ఢిల్లీ ప్రభుత్వం రాబ‌డిలో 41 శాతం త‌గ్గుద‌ల న‌మోదైంద‌ని అన్నారు. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవ‌త్సరంలోనూ రాబ‌డిలో 23 శాతం త‌గ్గింద‌ని చెప్పారు.

అలాగే మద్యం షాపులకు కనీసం 500 చదరపు మీటర్ల స్థలం అవసరమని, ఇక నుంచి కౌంటర్‌ షాపు పక్కన ఉండకుండా మద్యం షాపులోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లు మద్యం షాపు కోసం చేతులు లోపల పెట్టి తీసుకోకుండా నేరుగా దుకాణం లోపలికి వచ్చి స్వయంగా మద్యం తీసుకోవచ్చన్నారు. షాపుల వద్ద మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవీ కూడా చదవండి: Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..

Important Tasks: ఈ మూడు పనులను సెప్టెంబర్‌ 30లోగా పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!