ఢిల్లీలో ఉధ‌‌ృతమవుతున్న రైతు సంఘాల ఆందోళన.. అన్నదాతలతో చర్చించేందుకు ఎప్పడూ సిద్ధమేనన్న ప్రధాని మోదీ

పెద్ద ఎత్తున తరలివస్తున్న రైతన్నలతో సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. రైతు పోరాటం మళ్లీ ఉధృతమవడంతో బోర్డర్స్‌లో భద్రతను పటిష్టం చేశారు.

ఢిల్లీలో ఉధ‌‌ృతమవుతున్న రైతు సంఘాల ఆందోళన.. అన్నదాతలతో చర్చించేందుకు ఎప్పడూ సిద్ధమేనన్న ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Jan 31, 2021 | 1:28 PM

Delhi farmers Protest : మళ్లీ ఉధృతమవుతోంది..ఫస్ట్‌ ఫేజ్‌ను మించి సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. సరిహద్దులకు అన్నదాతలు పోటెత్తుతున్నారు. రైతు సంఘం నేత రాకేష్‌ తికాయత్‌ కన్నీళ్లు..రైతులను కదిలించాయి. ఆయన ఉద్వేగ ప్రసంగంతో కదం తొక్కుతున్నారు కర్షకులు. ఇప్పటివరకు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచే తరలివచ్చారు. కానీ ఇప్పుడు యూపీ, రాజస్థాన్‌ల నుంచి కూడా వచ్చి శిబిరాల్లో కూర్చుంటున్నారు.

ఘాజీపూర్‌ ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారింది. పెద్ద ఎత్తున తరలివస్తున్న రైతన్నలతో సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. రైతు పోరాటం మళ్లీ ఉధృతమవడంతో బోర్డర్స్‌లో భద్రతను పటిష్టం చేశారు. బారికేడ్లతో రోడ్లను మూసివేశారు. ఎటువంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి, ఘాజీపుర్‌ సహా ఇతర ప్రాంతాల్లోనూ పాలమిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 67 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు అన్నదాతలు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపేస్తామని కేంద్రం ప్రతిపాదించినా..ససేమిరా అంటున్నారు. మరోవైపు నిన్న అఖిలపక్ష సమావేశంలో రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ప్రధాని మోదీ. రైతులు ఒక్క ఫోన్‌ చేస్తే చాలు..సాగు చట్టాలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఐతే కేంద్రంతో చర్చలకు ద్వారాలు మూయలేదన్న రైతుసంఘాలు..మూడు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనకడుగు లేదని స్పష్టం చేశాయి.

రానున్న రోజుల్లో ఉద్యమం మరింత బలపడుతుందని స్పష్టం చేశారు రైతు సంఘాల నేతలు. ఫిబ్రవరి 2న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల మోహరింపు రికార్డ్‌ స్థాయిలో ఉంటుందని ప్రకటించారు..6 రాష్ట్రాల నుంచి అన్నదాతలు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు ప్రకటించారు. మరోవైపు నిలిపివేసిన ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

ఇక, పలువురు జర్నలిస్టులనూ అరెస్ట్‌ చేశారు పోలీసులు. కిసాన్ పరేడ్ సందర్భంగా రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇదీ చదవండిః Budget 2021: రేపే కేంద్ర బడ్జెట్, ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, కోవిడ్ తెచ్చిన కష్టాలు తీరేనా ?

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్