Delhi CBI Raids: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై FIR నమోదు.. లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా అవినీతి..

ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిసోడియాను CBI అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుందా అనే ఊహాగానాలూ వచ్చాయి. లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు..

Delhi CBI Raids: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై FIR నమోదు.. లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా అవినీతి..
Delhi Cbi Raid
Sanjay Kasula

|

Aug 19, 2022 | 7:17 PM

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై FIR నమోదైంది. ఆయనతోపాటు మరో 15 మందిని కూడా నిందితులగా పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో కొన్ని మద్యం కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు 15 మందితో పాటు పలువురు గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. సిబిఐ ప్రకారం, మనీష్ సిసోడియాపై కూడా నేరపూరిత కుట్ర, ఖాతాల తారుమారు ఆరోపణలు ఉన్నాయి. ఈ FIR 120-B, 477-A , సెక్షన్-7 కింద నమోదు చేయబడింది. ఈ ఉదయం ఆయన నివాసంతోపాటు 21 చోట్ల CBI సోదాలు సంచలనంగా మారాయి. మొత్తం 7 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేయడంతో నెక్స్ట్‌ ఏదో జరగబోతోంది అనే చర్చ జరుగుతోంది.

నాడు ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిసోడియాను CBI అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుందా అనే ఊహాగానాలూ వచ్చాయి. లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంతో CBI ఇటీవలే రంగంలోకి దిగింది.

గతేడాది నవంబరులోనే నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు. ఐతే.. ప్రైవేటు వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా కొన్ని నిబంధనలను ఉల్లంఘన జరిగినట్టు, తద్వారా కొందరు లబ్ది పొందినట్టు విచారణ కమిటీ తేల్చింది. జులైలో ఆ నివేదిక ఇచ్చింది. దీనిపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు. ఇలాంటి విచారణలకు తాము భయపడేది లేదని CM అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu