ట్రాఫిక్ రూల్ అతిక్రమించిన డ్రైవర్.. బోనెట్‌పైకెక్కిన పోలీస్ !

ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన  డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్.. అయితే ఆయన బారి నుంచి తప్పించుకునేందుకు ఆ డ్రైవర్ ఒక్కసారిగా తన వాహనాన్ని ముందుకు దూకించాడు. . అతడ్ని పట్టుకునేందుకు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ చటుక్కున కారు బోనెట్ పైకి జంప్ చేశాడు. కానీ ఆ డ్రైవర్ కారును ఆపకుండా అలాగే సుమారు 2 కిలోమీటర్ల దూరం నడిపాడు. బోనెట్ మీదున్న పోలీసాయన మాత్రం బెదరకుండా అలాగే  వేలాడుతుండడంతో.. ఇక చేసేది లేక డ్రైవర్ ఒకచోట […]

ట్రాఫిక్ రూల్ అతిక్రమించిన డ్రైవర్.. బోనెట్‌పైకెక్కిన పోలీస్ !

ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన  డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్.. అయితే ఆయన బారి నుంచి తప్పించుకునేందుకు ఆ డ్రైవర్ ఒక్కసారిగా తన వాహనాన్ని ముందుకు దూకించాడు. . అతడ్ని పట్టుకునేందుకు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ చటుక్కున కారు బోనెట్ పైకి జంప్ చేశాడు. కానీ ఆ డ్రైవర్ కారును ఆపకుండా అలాగే సుమారు 2 కిలోమీటర్ల దూరం నడిపాడు. బోనెట్ మీదున్న పోలీసాయన మాత్రం బెదరకుండా అలాగే  వేలాడుతుండడంతో.. ఇక చేసేది లేక డ్రైవర్ ఒకచోట వాహనాన్ని ఆపి దిగి పారిపోయాడు.  ఈ ఘటనలో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. కారులోని సహ ప్రయాణికుడొకరు ఈ తంతంగాన్ని తన మొబైల్ లో రికార్డు చేశారు. గత ఏడాది నవంబరులో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో  తాజాగా రిలీజయింది.  అయినా విధి నిర్వహణలో ఆ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ చూపిన సమయ స్ఫూర్తిని, సాహసాన్ని ఇప్పటికీ అభినందిస్తూనే ఉన్నారు చాలామంది.

Published On - 4:59 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu