ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ముందు హాజరు కానున్న ఫేస్ బుక్ అధికారులు

దేశంలో ద్వేషపూరిత కంటెంట్ ను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ ను ఈ నెల 15 న తమ ఎదుట హాజరు కావలసిందిగా ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఆదేశించింది.

ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ముందు హాజరు కానున్న ఫేస్ బుక్ అధికారులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 12, 2020 | 7:05 PM

దేశంలో ద్వేషపూరిత కంటెంట్ ను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ ను ఈ నెల 15 న తమ ఎదుట హాజరు కావలసిందిగా ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు నోటీసును జారీ చేసింది. ఆ రోజున మీరు వఛ్చి వాంగ్మూలం ఇవ్వాలని, కమిటీ ప్రొసీడింగ్స్ లో పాల్గొనాలని ఈ సమన్లలో పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ద్వేషపూరిత పోస్టులను నిలిపివేయాలని ఫిర్యాదులు అందడంతో ఆయనను ఫేస్ బుక్ బ్యాన్ చేసింది.  ప్రస్తుతం ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా నేతృత్వంలోని అసెంబ్లీ కమిటీ అజిత్ మోహన్ నుంచి వివరణను కోరనుంది. అటు- అజిత్ మోహన్ ను ఇటీవల సమాచార , టెక్నాలజీపై గల పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా విచారించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ అద్వర్యంలోని కమిటీ ఆయనను, ఫేస్ బుక్ ఇండియాకు చెందిన మరో ఇద్దరు ప్రతినిధులను సుదీర్ఘంగ్గా ప్రశ్నించింది.